భరత్ కు అలా అలా అన్ని కలిసొస్తున్నాయి

Update: 2018-04-18 11:48 GMT

గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాలు పలు భాషల్లో విడుదలవుతూ మార్కెట్ ని పెంచుకుంటూ పోతుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవడం తర్వాత ఓవర్సీస్ లోను భారీగా విడుదలవుతూ కలెక్షన్స్ రాబడుతున్నాయి. కానీ గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాలు పక్క రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున విడుదలవుతున్నాయి. ఆయా భాషల సినిమాలు కూడా తెలుగులో విడుదలై సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కలెక్షన్స్ కొన్నాళ్ల క్రితం పక్క రాష్ట్రాల్లో ఉండేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇతర భాషల్లోనూ భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. కన్నడలో అయితే మన స్టార్ల సినిమాలకు ఏకంగా.10 కోట్ల దాకా రేటు పలికే పరిస్థితి ఉంది.

అలాగే కోలీవుడ్ తమిళనాడు కూడా తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు అందించే రాష్ట్రమే. తమిళనాడులో చెన్నై సహా అనేక పెద్ద నగరాల్లో తెలుగు సినిమాలు పెద్ద ఎత్తునే రిలీజవుతుంటాయి. కానీ ఈమధ్యన సర్వీస్ ప్రొవైడర్స్ నిర్మాతలకు తలెత్తిన విభేదా వలన నాలుగైదు రాష్ట్రాల థియేటర్స్ బంద్ కొనసాగించారు. అయితే టాలీవుడ్ నిర్మాతలు సర్వీస్ ప్రొవైడర్స్ కి మధ్య సఖ్యత కుదిరి గత నెల తొమ్మిది నుండే థియేటర్స్ లో బొమ్మ పడింది. కానీ పక్క రాష్ట్రం తమిళనాట ఈ రోజు బుధవారం వరకు సమ్మె కొనసాగించారు. అయితే ఈ రోజు సర్వీస్ ప్రొవైడర్స్ కి నిర్మాతల మండలికి మధ్య జరిగిన ఒప్పందంతో అక్కడ థియేటర్స్ తెరుచుకున్నాయి. అందులో భాగంగానే... గత నెల నుంచి తమిళ నిర్మాతలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 8 నుంచి తెలుగు సినిమాల ప్రదర్శన కూడా ఆపేయడానికి తెలుగు నిర్మాతల మండలి అంగీకరించింది. దీంతో అప్పటిదాకా బాగా ఆడుతున్న రంగస్థలం ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. అలాగే నితిన్ సినిమా చల్ మోహన్ రంగ, నాని మూవీ కృష్ణార్జున యుద్ధంలకు తమిళనాట కలెక్షన్స్ పడిపోయి ప్లాప్ అయ్యాయి.

కానీ ప్రస్తుతం తమిళనాట థియేటర్స్ తెరచుచుకోవడం ద్వారా మహేష్ భరత్ అనే నేను కి కలిసొచ్చింది. ప్రస్తుతం భారీ అంచనాల నడుమ భారీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న భరత్ అనే నేను తమిళనాట విడుదల కాదేమో.. అక్కడ కలెక్షన్స్ రావేమో అని భయపడిన భరత్ టీమ్ కి ఇప్పుడు అన్ని కలిసొచ్చేశాయి. ప్రస్తుతం భారీ క్రేజ్ నడుమ విడుదలవుతున్న భరత్ అక్కడ తమిళనాట కూడా విడుదలై భారీ ఆకలెక్షన్స్ తెచ్చేసుకోవడానికి రెడీ అయ్యింది. మరి మహేష్ గత చిత్రం స్పైడర్ తో హిట్ అందుకోలేకపోయినా తమిళులకు బాగా దగ్గరయ్యాడు. మరి ఇలాంటి టైం లో భరత్ అనే నేను మీద తమిళ ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. మామూలుగానే మహేష్ సినిమాలో చెన్నై లాంటి నగరాల్లో పెద్ద ఎత్తున రిలీజవుతుంటాయి. ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయిలో భరత్ అనే నేనును రిలీజ్ చేసే అవకాశముంది. ఈ లెక్కన భరత్ కు అలా అలా అన్ని కలిసొచ్చేస్తున్నాయనిపించడం లేదూ..!

Similar News