భరత్ అనే నేను కాపీ కొట్టేశారు...!!

Update: 2018-04-13 08:51 GMT

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకుల్లోనూ ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్న భరత్ నేను నేను ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సినిమా కథని కొరటాల శివ ప్రస్తుతం రాజకీయాల్లో హైలెట్ గా నిలుస్తున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని రాసాడని టాక్ వుంది. అది నిజమే అని కూడా అంటారు. అలాగే ఎంతగా పవన్ ని స్ఫూర్తిగా తీసుకున్నా.. కొరటాల ఆ కథను తన శైలిలో రాసుకుని మెరుగులు దిద్దడం కూడా వాస్తవం అంటున్నారు. అయితే ఎంతగా కొరటాల పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నా... ఇప్పుడు కొరటాల భరత్ అనే నేను కథను ఒక తెలుగు సినిమాకి కాపీగా తీసాడని టాక్ వినబడుతుంది.

లీడర్ సినిమా మాదిరిగా.....

అది కూడా తాజాగా వచ్చిన శేఖర్ కమ్ముల - రానా ల లీడర్ సినిమా. భరత్ అనే నేను సినిమాలో మహేష్ సీఎం పాత్రలో కనిపిస్తాడు. అలాగే రానా కూడా లీడర్ లో సీఎం గా కనిపిస్తాడు. తన తండ్రి చనిపోతే వారసత్వంగా సీఎం పదవి కోసం అడ్డదారులు తొక్కిమరి... రానా సీఎం గా రాజకీయాలను ప్రక్షాళన చెయ్యాలని కంకణం కట్టుకున్నప్పటికీ... రాజకీయాలలో జరిగే సంక్షోభంతో అనుకొని పరిస్థితుల్లో తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసం చివరికి రానా సీఎం గా కూడా కరెప్ట్ అవడానికి సిద్ధపడతాడు. అయితే ఇప్పుడు భరత్ అనే నేను సినిమా థీమ్ కూడా లీడర్ తరహాలోనే సాగుతుందట. లీడర్ లోలాగానే భరత్ లో కూడా తన తండ్రి చనిపోతే తల్లి కోరిక మేరకు మహేష్ సీఎం అవతారమెత్తడమే కాదు... రాజకీయాలను ప్రక్షాళన చేసి.... సీఎం గా తానేమిటో నిరూపించుకునే క్రమంలో జరిగే ఘటనలు కొరటాల తన స్టయిల్లో తెరకెక్కించినట్లుగా ప్రచారం జరుగుతుంది.

చూసేంత వరకూ....

అందుకే సోషల్ మీడియాలో రానా లీడర్ సినిమాకి మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాకి పోలిక పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే సినిమా చూసేవరకు భరత్ అనే నేను, లీడర్ సినిమాని కాపీ చేశారా లేదా అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. చూద్దాం భరత్ కి లీడర్ కి ఏ మేర పోలికలున్నాయి అనేది మరో వారంలోనే తెలిసిపోతుంది.

Similar News