' భ‌ర‌త్ అను నేను' ట్రైల‌ర్ రివ్యూ.... హిట్టుకు హామీ ఇచ్చిన‌ట్టే

Update: 2018-04-07 17:46 GMT

మ‌హేష్‌బాబు అభిమానులే కాకుండా యావ‌త్ టాలీవుడ్ సినీ అభిమానులు గ‌త యేడాది కాలం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న సినిమా భ‌ర‌త్ అను నేను. గ‌తంలో మ‌హేష్ - కొర‌టాల కాంబోలో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డం... ఇప్పుడు అదే కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌డం.... కొర‌టాల మూడు వ‌రుస బ్లాక్ బస్ట‌ర్ హిట్ల‌తో ఉండ‌డంతో స‌హ‌జంగానే ఈ సినిమాపై స్కై రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఇక ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌లో రిలీజ్ చేసిన ట్రైల‌ర్ చూశాక సినీజ‌నాల మ‌తులు పోతున్నాయి.

2.01 నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్‌లో క‌థేంటో పూర్తిగా తెలియ‌కుండా ద‌ర్శ‌కుడు కొర‌టాల జాగ్ర‌త్త ప‌డ్డా స‌మాజంలో కుళ్లిపోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌తో ఎదురైన ఇబ్బందుల నేప‌థ్యంలో మ‌హేష్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు చూసి ఎలా స్పందించాడు ? ఈ కుళ్లిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఎలా ప్ర‌క్షాళ‌న చేశాడు ? చివ‌ర‌కు ఎలా సీఎం అయ్యాడు ? అసెంబ్లీలో త‌న‌ను టార్గెట్ చేసిన ప్ర‌తిప‌క్షాల‌కు ఎలా ఆన్స‌ర్ ఇచ్చాడ‌న్న‌ది మాత్రం క్లారిటీగా తెలుస్తోంది.

రాజ‌కీయాల్లోకి కొత్త‌వాడు వ‌స్తున్నాడు... వాడికి క్రేజ్ వ‌స్తుందంటే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ శ‌క్తులు అన్ని ఒక్క‌ట‌వుతాయి.... మ‌నం ఉండ‌గా కొత్త వాడు ఎందుకు... ఉంటే అధికారంలో మేం ఉండాలి... లేక‌పోతే మీరు ఉండాల‌న్న సిద్ధాంతంతో వాళ్లు తెర‌ముందు న‌టిస్తూ తెర‌వెన‌క చేతులు క‌లుపుతారు. ఈ సినిమాలో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని ట్రైల‌ర్‌లో చిన్న హింట్ ఇచ్చారు. దేవ‌రాజ్ - ప్ర‌కాష్‌రాజ్ - ర‌విశంక‌ర్ లాంటి వాళ్లు ఇక్క‌డ రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కులుగా ఉన్నారు. వీరిలో ఎవ‌రు పొజిష‌న్‌, ఎవ‌రు అపోజిష‌న్ అన్న‌ది సినిమాలో చూడాలి.

పొలిటిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా అయినా కొర‌టాల గ‌త సినిమాల స్టైల్లోనే మంచి సందేశం ఉంటుంద‌ని తేట‌తెల్ల‌మ‌వుతోంది. ట్రైల‌ర్‌లో డైలాగులు పేల‌డంతో పాటు పంచింగ్‌గా ఉన్నాయి. త‌ప్పు జ‌రిగితే కొంచెం క‌ఠినంగా ఉండి... దానిని క‌రెక్ట్ చేయ‌డానికి ట్రై చేస్తే రాచరికం గుర్తొచ్చిందా నాకు అమ్మా నాన్న గుర్తొచ్చారు అంటూ మహేష్ మొదట్లో పలికిన డైలాగ్ బాగా పేలింది.

ఇక భ‌ర‌త్ అను నేను... హామీ ఇస్తున్నాను... దిస్ ఈజ్ అంటూ వ‌చ్చే బ్యాంక్ గ్రౌండ్ థీమ్ ట‌చ్చింగ్‌గా ఉంది. ఎట్ట‌కేల‌కు ఒక్క‌డొచ్చాడ‌బ్బా.... రాజ‌కీయ నాయ‌కుడు అనుకున్నా... నాయకుడు అని రావూ ర‌మేష్ మ‌హేష్ గురించి చెప్పే డైలాగ్ అత‌డి క్యారెక్ట‌ర్ స్వభావాన్ని చెప్పింది. త్వ‌ర‌లోనే మీ అంద‌రిని మాట మీద నిల‌బ‌డే మ‌గాళ్లుగా నిల‌బెడ‌తాన‌ని దైవ‌సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను అని రాజ‌కీయ వ్య‌వ‌స్థ మార్పుపై పంచ్ పేల్చాడు.

ఇక ఎవ‌రైనా సీఎం అవుతుంటే ప‌క్క‌న ఉన్న వాళ్లు చూస్తూ ఊరుకోరు క‌దా... అందుకే మ‌హేష్ కూడా ఎన్నో పోరాటాలు, ఫైటింగ్‌లు చేయాల్సిందే. అందుకే కొర‌టాల గ‌త సినిమాల క‌న్నా భ‌ర‌త్‌లో యాక్ష‌న్ డోస్ ఎక్కువే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఫైట్ల‌తో పాటు ఛేజింగ్ సీన్లూ ఉంటాయ‌ని ట్రైల‌ర్‌లోనే చెప్పేశారు. ఇక ఫైన‌ల్‌గా మ‌హేష్ హౌస్‌లో (అసెంబ్లీలో) ఉన్న వారంద‌రి డౌట్లు క్లీయ‌ర్ చేసేందుకు ఏప్రిల్ 20న థియేట‌ర్ల‌లోకి దిగ‌నున్నాడు.

ట్రైల‌ర్ ఫైన‌ల్ టాక్‌...

ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి సినిమా అభిమాని మ‌హేష్ భ‌ర‌త్ అను నేను హిట్టుకు హామీ ఇస్తున్నాన‌ని రాసి పెట్టుకోండ‌ని చెప్పాడ‌ని ఫీల్ అవుతున్నారు. మ‌రి భ‌ర‌త్ ఏం చేస్తాడో ? చూద్దాం.

Similar News