భారీ క‌లెక్ష‌న్ల దిశ‌గా భ‌ర‌త్‌..వసూళ్లు ఎంతో తెలుసా?

Update: 2018-04-24 07:54 GMT

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ భ‌ర‌త్ అనే నేను బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వీరంగం ఆడుతోంది. తొలి రెండు రోజుల‌కే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా మ‌హేష్‌బాబు కెరీర్‌కు ఊపిరిలూదింది. ఇప్ప‌టికే రూ.130 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసిన ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత కూడా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌డుతోంది. మ‌హేష్‌బాబు కంచుకోట అయిన ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే 2.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దాటేసి 3 మిలియ‌న్ డాల‌ర్ల దిశ‌గా దూసుకుపోతోంది.

బాహుబలి మినహా.....

ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద భ‌ర‌త్ జోరుకు బ్రేకులు వేసే సినిమాలు లేక‌పోవ‌డంతో రంగ‌స్థ‌లం హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. తెలుగులో బాహుబ‌లి మిన‌హా ఏ సినిమా ఇంత స్పీడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. ఇక ఫుల్ ర‌న్‌లో భ‌ర‌త్ రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు, సినిమా ఎన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు బాహుబ‌లిని మిన‌హాయిస్తే ఏ సినిమాకు ఈ రికార్డు లేదు.

200 కోట్లకు సులువుగా....

రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం మాత్రం రూ.185 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమా రూ.200 కోట్ల క్ల‌బ్‌లోకి చేర‌డం అసాధ్య‌మే. ఇప్పుడు భ‌ర‌త్ ముందు వ‌చ్చే నెల 4వ తేదీ అల్లు అర్జున్ నా పేరు సూర్య రిలీజ్ అయ్యే వ‌ర‌కు పోటీ ఇచ్చే సినిమా కూడా లేదు. ఇక ఫుల్ స్వింగ్‌లో ఉన్న భ‌ర‌త్ రూ.200 కోట్ల మార్క్ సులువుగా చేరుకుంటుంద‌ని అంద‌రూ అంచ‌నా. మ‌రి సీఎంగా విజృంభిస్తోన్న భ‌ర‌త్ ఏం చేస్తాడో ? చూడాలి.

Similar News