భ‌ర‌త్ రాజ‌కీయం చాలా పెద్ద‌దే... ర‌న్ టైం డీటైల్స్‌

Update: 2018-04-17 05:58 GMT

ప్రిన్స్ మ‌హేష్‌బాబు - కొర‌టాల శివ కాంబోలో వ‌స్తోన్న భ‌ర‌త్ అనే నేను సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాకు ట్రైల్ షో టాక్‌తో పాటు సెన్సార్ షో త‌ర్వాత ఫుల్ పాజిటివ్ టాక్ న‌డుస్తోంది. అయితే ఈ సినిమా ర‌న్ టైం ఇప్పుడు అంద‌రిని టెన్ష‌న్ పెడుతోంది.

ప్ర‌స్తుతం ప్రేక్ష‌కులు 2 లేదా 2.15 గంట‌ల సినిమాలు చూసేందుకే ఎక్కువ ఇష్ట‌ప‌డుతున్నారు. ర‌న్ టైం లాంగ్‌గా ఉంటే సినిమా ఏ మాత్రం బోర్ కొట్టినా ప్రేక్ష‌కుడు ప్లాప్ టాక్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియా ఎలాగూ ఉండ‌నే ఉంది. అయితే కంటెంట్ ఉంటే ర‌న్ టైం ఎక్కువ ఉన్నా చూస్తార‌ని అర్జున్‌రెడ్డి, రంగ‌స్థ‌లం సినిమాలు రుజువు చేశాయి. ఇక ఇప్పుడు భ‌ర‌త్ ర‌న్ టైం విష‌యానికి వ‌స్తే ఈ సినిమా 173 నిమిషాల నిడివితో ఫైన‌ల్ కాపీ రెడీ అయ్యింది.

మూడు గంట‌ల‌కు 7 నిమిషాలు మాత్ర‌మే త‌క్కువ‌. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే ఏ సినిమా కూడా ఇంత లాంగ్ ర‌న్ టైంతో లేదు. ఇక సెన్సార్ వాళ్లు యూ / ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో సినిమాకు పాజిటివ్ వ‌స్తోంది. మ‌రి ఇంత ర‌న్ టైంలో కొర‌టాల ఎలా మ్యాజిక్ చేశాడు ? అన్న‌దే ఇప్పుడు ఉత్కంఠ‌గా ఉంది. ఫ‌స్టాఫ్‌లో హీరో నేప‌థ్యం, విద్య అంశాల‌తో సినిమాను మూవ్ చేసిన కొర‌టాల సెకండాఫ్‌లో 30 నిమిషాల పాటు స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌తో సినిమా క‌థ‌ను మ‌లుపు తిప్పాడ‌ట‌.

Similar News