' భ‌ర‌త్ ' టోట‌ల్‌గా ఎంత తెచ్చిందంటే.

Update: 2018-04-20 02:06 GMT

క్రేజీ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను ఫ్రూవ్ చేసింది. ఇక మ‌హేష్‌కు ఎన్ని వ‌రుస ప్లాపులు వ‌చ్చినా కూడా మ‌నోడి కొత్త సినిమాకు ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌ద‌నేందుకు కూడా ఈ సినిమాయే నిద‌ర్శ‌నం. శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న భ‌ర‌త్‌కు మ‌హేష్ గ‌త అన్ని సినిమాల కంటే ఎక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. వాస్త‌వంగా చూస్తే శ్రీమంతుడు హిట్ త‌ర్వాత మ‌హేష్ చేసిన బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ రెండూ డిజాస్ట‌ర్లే.

బ్ర‌హ్మోత్స‌వంకు రూ.30 కోట్ల వ‌ర‌కు లాస్ వ‌స్తే, స్పైడ‌ర్ ఏకంగా రూ.60 కోట్ల న‌ష్టాల‌తో ఇండియ‌న్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల లిస్టులో చేరిపోయింది. అయినా కూడా ఈ రెండు సినిమాల ప్ర‌భావం భ‌ర‌త్ బిజినెస్ మీద ఏ మాత్రం ప‌డ‌లేదు. ఈ సినిమా ఓవ‌రాల్‌గా రూ.140 కోట్లు రిలీజ్‌కు ముందే కొల్ల‌గొట్టింది. నిర్మాత దాన‌య్య‌కు రూ.18 కోట్ల వ‌ర‌కు లాభం వ‌చ్చిందంటున్నారు.

ఏరియాల వారీగా చూస్తే.. నైజాం హక్కులను 22 కోట్ల రూపాయలకు తీసుకున్నారు. సీడెడ్ 12.6 కోట్లు – వైజాగ్ 8.2 కోట్లు – ఈస్ట్ 6.7 కోట్లు – వెస్ట్ 6 కోట్లు – కృష్ణా + గుంటూరు 13.5 కోట్లు – నెల్లూరు 3.0 కోట్లు పలకడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల వరకే భరత్ అనే నేను థియేట్రికల్ హక్కుల లెక్క 72 కోట్లుగా తేలింది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి కర్నాటక 8.2 కోట్లు – రెస్టాఫ్ ఇండియా 1.6 – ఓవర్సీస్ 18.2 కోట్లు పలకడంతో.. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది.

ఇక తెలుగు శాటిలైట్ హక్కులను ఏకంగా 22.5 కోట్లకు విక్రయించగా.. హింది డబ్ రూపంలో 15.5 కోట్ల సమకూరాయి. ఆడియో ప్లస్ ఇతరాలు 2 కోట్లు కాగా.. మొత్తం 140 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక థియేట్రిక‌ల్ హిట్ అనిపించుకోవాలంటే రూ.100 కోట్ల షేర్ వ‌స్తే బ్రేక్ ఈవెన్‌లోకి వ‌స్తుంది.

Similar News