' భ‌ర‌త్ ' ఫ‌స్ట్ డే టార్గెట్ ఎంత‌

Update: 2018-04-20 01:56 GMT

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌తో పాటు సినీ అభిమానులంద‌రూ ప్ర‌స్తుతం భ‌ర‌త్ గురించే మాట్లాడుకుంటున్నారు. మహేష్ – కొరటాల శివ కలయికలో తెర‌కెక్కిన ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చిత్ర యూనిట్ సైతం గతంలో మహేష్ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. కేవలం అమెరికా లో 2000 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు పడుతుండడంతో, భారీ రికార్డులను ‘భరత్ అనే నేను’ కొల్లగొడుతోందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది..

మూడేళ్ల క్రితం ఇదే కల‌యిక‌లో వ‌చ్చిన శ్రీమంతుడు అప్ప‌ట్లోనే నాన్ బాహుబ‌లి రికార్డుల‌కు పాత‌రేసింది. ఇక ఇప్పుడు ఆ రికార్డులు ఖైదీ ఆ త‌ర్వాత తాజాగా వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం లిఖించుకున్నాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బాహుబ‌లి రికార్డుల‌ను వ‌దిలేస్తే రంగ‌స్థ‌లం సినిమాయే రూ.175 కోట్ల గ్రాస్‌, రూ.105 కోట్ల షేర్‌తో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను త‌న పేరిట లిఖించేసుకుంది.

మూడేళ్ల క్రితం వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా ఓవ‌రాల్‌గా రూ.144 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇప్పుడు మ‌హేష్ క్రేజ్‌, పెరిగిన థియేట‌ర్లు, సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో భ‌ర‌త్‌కు హిట్ టాక్ వ‌స్తే సులువుగానే రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి మ‌ళ్లీ నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను మ‌హేష్ త‌న ఖాతాలోనే వేసుకుంటాడ‌ని అంటున్నారు.

ఇక ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఇప్పుడు మెయిన్‌. రంగ‌స్థ‌లం సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.19 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్లు వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా రూ.30 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌చ్చింది. అయితే మ‌హేష్ శ్రీమంతుడు సినిమాకు కూడా తొలి రోజు రూ.32 కోట్ల గ్రాస్ వ‌చ్చింది. అది మూడేళ్ల క్రితం. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వ‌స్తే భ‌ర‌త్ భీభ‌త్సం ఫ‌స్ట్ డే రూ.40 - 45 కోట్ల షేర్, రూ.50 - 60 కోట్ల గ్రాస్ రేంజ్‌లో ఉంటుంద‌ని ట్రేడ్ అంచ‌నా.

Similar News