భ‌ర‌త్ అనే నేను ఫ‌స్టాఫ్ - సెకండాఫ్ స్టోరీ ఇదే

Update: 2018-04-17 06:07 GMT

ఇటు సూప‌ర్‌స్టార్, అటు ఇండ‌స్ట్రీలో ముగ్గురు బ‌డా హీరోల‌కు మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడు. మ‌రి ఇప్పుడు వీరి కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఎలా ఉంటుంది ? ఎన్ని అంచ‌నాలు ఉంటాయో ? ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భ‌ర‌త్ ఈ నెల 20న రిలీజ్ అవుతుండ‌డంతో ప్ర‌మోష‌న్లు కూడా స్పీడ్ అందుకున్నాయి. ఇక సినిమా క‌థ ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వచ్చేసింది. ఈ క‌థ త‌కిట త‌కిట సినిమా ద‌ర్శ‌కుడు శ్రీహరి నానుది అని వార్త‌లు వ‌స్తుండ‌డంతో దానిపై కూడా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్లారిటీ ఇచ్చాడు.

కెరీర్ స్టార్టింగ్‌లో తాను ద‌ర్శ‌కుడు శ్రీహ‌రి రూమ్‌మేట్స్ అని... ఈ లైన్ శ్రీహ‌రి చెప్ప‌గా పూర్తిగా తానే డ‌వ‌ల‌ప్ చేశాన‌ని కొర‌టాల చెప్పారు. అందుకే సినిమా టైటిల్స్‌లో శ్రీహ‌రి పేరు స్పెష‌ల్‌గా వేశామ‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌లో హీరో ప‌రిచ‌యం, స‌మాజం ప‌ట్ల అత‌డికి ఉన్న భావ‌జాలం, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్న హీరో వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెట్టాక ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడో ? ఈ అంశాల‌తో ఉంటుంద‌ట‌.

డిగ్రీ కంప్లీట్ చేసుకున్న భ‌ర‌త్‌కు స‌మాజంలో ప్ర‌తి చోటా ఇబ్బంది, కుళ్లు, కుట్రలు, అవినీతి ఎదుర‌వుతాయ‌ట‌. తొలి గంట ఆట‌లో హీరో, హీరోయిన్ల పాత్ర‌ల ప‌రిచ‌యం, వారి మ‌ధ్య ప్రేమ‌, రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులతో క‌థ న‌డుస్తుంద‌ట‌. ప్రీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ నుంచి క‌థ ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుని స్పీడ‌ప్ అవుతుంద‌ట‌. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందంటున్నారు.

ఇక మ‌హేష్ రాజ‌కీయాల్లోకి రావ‌డం, సీఎం అవ్వ‌డం ఈ క‌థంతా సెకండాఫ్‌లో న‌డుస్తుంద‌ని తెలిసింది. సెకండాఫ్‌లో ప్ర‌తి సీన్ చాలా రేసీగా ఉంటుంద‌ట‌. అందుకే సినిమా ర‌న్ టైం చాలా ఎక్కువుగా 173 నిమిషాల ఉన్నా క‌ట్ చేసేందుకు ద‌ర్శ‌కుడు ఇష్ట‌ప‌డ‌లేదు. ఈ విష‌యాన్ని కొర‌టాల కూడా చెప్పారు. ఇక క్లైమాక్స్‌కు ముందు మ‌హేష్‌ను సీఎం పీఠం నుంచి దింపేందుకు మిగిలిన పార్టీలు ఒక్క‌ట‌వ్వ‌డం, ఆ త‌ర్వాత వారి కుయుక్తుల‌ను తిప్పి కొట్టేందుకు వేసే ఎత్తుల‌తో చివ‌రి 45 నిమిషాలు సూప‌ర్బ్ అంటున్నారు.

Similar News