అమెరికాలో దూసుకుపోతున్న భరత్ అనే నేను

Update: 2018-04-29 12:11 GMT

'భరత్ అనే నేను' మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుంది. ఐన కానీ కలెక్షన్స్ విషయంలో భరత్ ఏమాత్రం తగ్గడంలేదు. రోజురోజుకి వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. మొదటిసారిగా మహేష్ సీఎం పాత్రలో కనిపించడం.. కొరటాల స్క్రీన్ ప్లే మ్యాజిక్.. కైరా గ్లామర్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా దుమ్ము దులుపుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా కలెక్షన్స్ యూఎస్ లో 3 మిలియన్ మార్క్ ను దాటినట్టు నిర్మాత డీవీవీ దానయ్య తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం వెల్లడించారు. యూఎస్ లో 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన మహేష్ తొలి సినిమా ఇదే.

గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు అమెరికాలో 2.8 మిలియన్ డాలర్లను రాబట్టగా, దాన్ని 'భరత్ అనే నేను' అధిగమించింది. పొలిటికల్ జోనర్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా 161.28 కోట్లు రాబట్టిందని, తాను నిజం చెబుతున్నానని నిన్న దానయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ 'రంగస్థలం' అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, దాన్ని మహేష్ ఈ వారంలో అధికమిస్తాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Similar News