భరత్ అనే నేను సినిమా ఫస్ట్ రివ్యూ!!

Update: 2018-04-12 06:10 GMT

కొరటాల శివ - మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు తర్వాత వస్తున్న చిత్రం కాబ్బట్టి ఫ్యాన్స్ లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయ్. భరత్ అనే నేను కచ్చితంగా శ్రీమంతుడు రికార్డ్స్ బ్రేక్ చేసి నాన్ బాహుబలి చిత్రంగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా టాక్ బయటికి వచ్చేసింది.

ఇలా సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా టాక్ బయటికి రావడం కొత్తేమీ కాదు. బిగ్గెస్ట్ క్రిటిక్ గా ప్రతి పెద్ద సినిమాను చూసి టాక్ ని బయటికి స్ప్రెడ్ చేస్తున్న ఉమైర్ సంధు ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి..సినిమా బ్లాక్ బస్టర్...సినిమా ఒక రేంజ్ ఉంది..ఫ్యాన్స్ కు పూనకాలే అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఈ క్రిటిక్.

ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం అని.. ఇన్సైడ్ టాక్ అదిరిపోయిందని..మహేష్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని ట్వీట్ చేసాడు ఉమైర్ సంధు. నిజానికి ఈ సినిమా ఇంకా సెన్సార్ పూర్తి అవ్వలేదు, ఫస్ట్ కాపీ రెడీ కాలేదు మరి మనోడు ఈ సినిమాను ఎక్కడ చూశాడో? అయితే ఉమైర్ సంధు ఇలా టాక్ స్ప్రెడ్ చేసి బ్లాక్ బస్టర్స్ అని చెప్పిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. అతను ఫేమ్ కోసమే సినిమాల క్రేజ్ ని అడ్డుపెట్టుకుంటున్నాడని ఆరోపణలు వున్నాయి. అసలు అతను నిజంగానే యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబరేనా? అనే మాటకు కూడా గ్యారంటీ లేదు. ఏదిఏమైనా ఈ సినిమా రిజల్ట్ మరి కొద్దీ రోజుల్లో తెలియనుంది.

Similar News