భ‌ర‌త్‌లో సీఎం గారి రాస‌లీల‌లు చూశారా..

Update: 2018-04-20 17:32 GMT

మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను ఫుల్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతోంది. మ‌హేష్ భ‌ర‌త్ అనే సీఎం రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే. లండ‌న్‌లో ఆక్స్‌ఫ‌ర్ట్ వ‌ర్సిటీలో చ‌దువుకున్న హీరో స‌డెన్‌గా తండ్రి చనిపోయాడని తెలిసి ఇండియాకు రావ‌డం అనుకోని ప‌రిస్ధితుల్లో సీఎం అయిపోవ‌డం జ‌రుగుతాయి. ఇక మ‌న యంగ్ డైన‌మిక్ సీఎం గారి రాస‌లీల‌లంటూ సినిమాలో ఓ ఎపిసోడ్ ఉంటుంది. ఇది చివ‌ర‌కు మీడియాకు ఎక్కి సీఎం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే వ‌ర‌కు వెళుతుంది.

మ‌రి సీఎం రాస‌లీల‌ల క‌థేంటో తెలుసుకుందాం. సీఎం భ‌ర‌త్‌రామ్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంటుంది. తాను రోజూ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లే దారిలో ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన వ‌సుమ‌తి క్యారెక్ట‌ర్ చేసిన హీరోయిన్ కైరా అద్వానీని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఆమెను ప్రేమిస్తున్నాన‌ని... పెళ్లి చేసుకుంటున్నాన‌ని చెపుతాడు. అయితే సినిమాలో ఆమె త‌క్కువ సీన్ల‌లోనే క‌నిపించినా ఆమె మాత్రం సీఎం రోల్ చేసిన మ‌హేష్‌ను సార్ అని మాత్ర‌మే సంబోధిస్తుంటుంది.

చివ‌ర‌కు మ‌హేష్‌ను సీఎం సీటు నుంచి దించే క్ర‌మ‌లో ఆమెతో మ‌నోడు స‌చివాల‌యంలో ఉన్న ఓ ఫొటోను తీసి మీడియాలో హైలెట్ చేస్తారు. రెచ్చిపోయిన మీడియా స‌చివాల‌యంలోనే సీఎం రాస‌లీల‌లు - రాస‌లీల‌ల సీఎం - రొమాంటిక్ సీఎం అని హెడ్డింగులు పెట్టి ఇష్టానుసారంగా వార్త‌లు రాసేస్తుంది. అటు ఎల‌క్ట్రానిక్ మీడియాలోనే ఇవే వార్త‌లు హైలెట్ చేస్తారు. చివ‌ర‌కు ఇదే కార‌ణంతో మ‌హేష్ త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ కౌంట‌ర్ ఇస్తాడు.

తాను సీఎంగా ఉన్న 8 నెల‌ల 13 రోజుల్లో విద్యా వ్య‌వ‌స్థ‌లో తెచ్చిన మార్పులు, ట్రాఫిక్ రూల్స్‌, స‌మూలంగా రాజ‌కీయాల‌ను మార్చిన‌వి ఏవీ క‌న‌ప‌డ‌ని మీడియాకు ఆ అమ్మాయితో ఉన్న‌ది మాత్ర‌మే క‌న‌ప‌డ్డానా ? 200 కాపీలు న్యూస్ పేప‌ర్లు పెంచుకునేందుకు, ఛానెల్స్ టీఆర్పీ పెంచుకునేందుకు ఇలా ప్ర‌చారం చేస్తారా ? అని ఘాటుగా వాళ్ల‌పై తీవ్రంగా విరుచుకుప‌డ‌తాడు. ఈ సీన్‌కు థియేట‌ర్లో విజిల్స్ ఆగ‌లేదు. ఏదేమైనా ప్ర‌స్తుతం మీడియాలో పెరిగిపోయిన విప‌రీత పోక‌డ‌లు ఎలా ఉంటాయో క‌రెక్టుగా చూపించిన కొర‌టాల వాటి తీరును ఇలా సీఎం రాస‌లీల‌ల సీన్లో ఎండ‌గ‌ట్టాడు.

Similar News