మహేష్ వేట చెన్నై నుండే మొదలయింది

Update: 2018-04-21 07:37 GMT

కొరటాల - మహేష్ క్రేజీ కాంబో లో వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ అదే క్రేజీ కాంబో రిపీట్ అవడము 'భరత్ అనే నేను' తో మళ్ళీ హిట్ కొట్టడము జరిగిపోయాయి. నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భరత్ అనే నేను' అప్పుడే కలెక్షన్స్ మోత మోగించేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లలో విడుదలైన 'భరత్ అనే నేను' హిట్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దున్నేస్తుంది. అయితే నిన్నగాక మొన్న థియేటర్స్ సమ్మె విరమించుకున్న తమిళనాట కూడా 'భరత్ అనే నేను' విడుదలై విజయదుందుభి మోగించింది. అక్కడ తమిళ ప్రేక్షకులు గత పది రోజులుగా తెలుగు సినిమాలు కూడా థియేటర్స్ లో ఆగిపోవడం.... మరి సినిమా ప్రియులు వెండితెర మీద బొమ్మ కోసం మొహం వాచిపోయి ఉన్నారు.

అందుకే 'భరత్ అనే నేను' చెన్నైలో తొలిరోజున భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజునే తొలి రికార్డును చెన్నై నుంచే 'భరత్ అనే నేను' మొదలుపెట్టింది. చెన్నై లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన 'భరత్ అనే నేను' తొలిరోజున చెన్నైలో 27 లక్షలకి పైగా గ్రాస్ ను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. మార్చ్ 30 న రామ్ చరణ్ 'రంగస్థలం' కూడా చెన్నై లో అధిక థియేటర్స్ లో విడుదలై మొదటిరోజున రికార్డు స్థాయిలో 25 లక్షల గ్రాస్ ను వసూలు చేసి అప్పటికి గాను మొదటిస్థానంలో నిలిచింది. కానీ మహేష్ 'భరత్ అనే నేను' 'రంగస్థలం' కన్నా రెండు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి మొదటి స్థానానికి చేరిపోయి రికార్డు కోట్టేసింది.

మరి కొరటాల శివ మహేష్ కి మళ్ళీ మరిచిపోలేని హిట్ అందించాడు. ఇంతకూ ముందు శ్రీమంతుడితో రికార్డులు సృష్టించిన ఈ కాంబినేషన్ లో మళ్ళీ భరత్ అనే నేనుతో కూడా రికార్డుల వేట మొదలెట్టేసింది. ఇక భరత్ అనే నేను మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 21.88 కోట్ల షేర్స్ రాబట్టింది.

Similar News