కష్టాల్లో భరత్

Update: 2018-05-09 05:41 GMT

గత నెల ఏప్రిల్ లో విడుదల అయిన మహేష్ బాబు భరత్ అనే నేను నుండి బ్లాక్ బస్టర్ ప్రామిస్.. బ్లాక్ బస్టర్ ప్రామిస్ అంటూ ప్రకటనలు ఇచ్చాడు నిర్మాత. కానీ నిజానికి ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఏమీ కాలేదు. బ్లాక్ బస్టర్ తగ్గ వసూల్ రాకపోవడంతో బాక్స్ ఆఫీస్ రేసు నుంచి ఈ సినిమా నిష్క్రమించేలా కనిపిస్తోంది.

ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 100 కోట్లు షేర్ ను సాదించాలి. కానీ రెండు వారాల్లో రూ.88 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. పోయిన వారం రిలీజ్ అయిన నా పేరు సూర్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా 90 కోట్ల షేర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ నా పేరు సూర్యకి డివైడ్ టాక్ రావడంతో దీనికి కలిసొచ్చింది.

మహేష్ గత రెండు సినిమాలు డిజాస్టర్ అయిన ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ మాత్రమే రూ.100 కోట్లు పలకడం విశేషం. నిజానికి 100 కోట్లు షేర్ ను వసూల్ చేయడం మహేష్ కి అంత కష్టమేమి కాదు. కానీ అంతటి కంటెంట్ లేకపోవడంతో ఆ అంచనాలు ఫలించలేదు. ట్రేడ్ వర్గాల లెక్కలు ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.95 కోట్ల షేర్‌తో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. అంటే రూ.5 కోట్ల నష్టం తప్పదన్నమాట. అటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే 3.6 మిలియన్ల దాకా వసూళ్లు రాబట్టాలి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా 3.35 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమాకు ముందు వచ్చిన రంగస్థలం ఓవర్సీస్ లో 3.5 మిలియన్ మార్కును దాటింది. కానీ భరత్..చిట్టి బాబు రికార్డు ని అందుకోలేకపోవచ్చు.

Similar News