బెల్లంకొండ ఫెయిల్యూర్స్ కి కారణం ఎవరు?

తన మొదటి సినిమా అల్లుడు శ్రీను తోనే స్టార్ హీరోయిన్స్ , స్టార్ డైరెక్టర్ తో చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తన డాడీ సురేష్ ప్లానింగ్ వల్ల [more]

Update: 2019-05-29 05:58 GMT

తన మొదటి సినిమా అల్లుడు శ్రీను తోనే స్టార్ హీరోయిన్స్ , స్టార్ డైరెక్టర్ తో చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తన డాడీ సురేష్ ప్లానింగ్ వల్ల హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ వల్ల కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలే పడ్డాయి. అయితే అవి హెవీ బడ్జెట్ కావడంతో, అమ్మకాల్లో తేడా లాంటి కారణాలతో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాతలకు కానీ, బయ్యర్లకు కానీ లాభాలు మిగిల్చిన ప్రాజెక్టు లేదు.

గ్రాఫ్ పూర్తిగా….

స్టార్ డైరెక్టర్స్ నుండి పేరు తెలియని డైరెక్టర్స్ వరకు తను సినిమాలు చేస్తున్నాడు అంటే అతని గ్రాఫ్ ఎంతలా పడిపోయిందో ఆలోచించవచ్చు . దీనికి కారణం బెల్లంకొండ శ్రీనివాసే. తనతో పాటు యంగ్ హీరోస్ అంత వైవిధ్యమైన కథలు చేస్తుంటే ఇతను మాత్రం సీనియర్ హీరోలు చేసే కథలు…నాసిరకమైన కథలతో కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. డైరెక్టర్స్ ని ఎంచుకునే విషయంలో కూడా ఇతను తప్పు చేస్తున్నాడు. కాలం చెల్లిన అని జనం అనుకునే భీమినేని, తేజ, రమేష్ వర్మ లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడం బెల్లంకొండ ఛాన్స్ ఇవ్వడం తప్పు.

ప్లానింగ్ ఎవరిదయినా….

ఎవరి నిర్ణయాలు అయినా, ఎవరి ప్లానింగ్ అయినా ప్రస్తుతానికి నష్టపోతున్నది బెల్లంకొండ శ్రీనివాస్ నే. తనకున్న బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ కు నప్పే కథలు చేసుకుంటే కెరీర్ చాలా బాగుంటుంది. సరైన కథ ఎంచుకుంటే హిట్ కచ్చితంగా కొడతాడు. మరి ఇతను ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్ లో తమిళ చిత్రం రీమేక్ చేస్తున్నాడు. కనీసం దీనితో అయినా హిట్ అందుకుంటాడేమో చూద్దాం.

Tags:    

Similar News