బెల్లంకొండ భ్రమపడుతున్నారా?

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇదే మొదటి హిట్ అనుకోవాలేమో. రాక్షసుడు తో తన కెరీర్ బెస్ట్ చిత్రంగా తన ఖాతాలో వేసుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాకి [more]

Update: 2019-08-08 07:36 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇదే మొదటి హిట్ అనుకోవాలేమో. రాక్షసుడు తో తన కెరీర్ బెస్ట్ చిత్రంగా తన ఖాతాలో వేసుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి, బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ చిత్రాలతో పోలిస్తే ఈసినిమా బెటర్ గా కలెక్ట్ చేస్తుంది. అయితే ఈమూవీ కి ఇంకా రావాల్సింది చాలా ఉంది.

రెండోవారం నుంచి…..

మొదటి వీక్ మంచి కలెక్షన్స్ తో పర్లేదు అనిపించుకున్న సెకండ్ వీక్ నుండి అసలు సిసలైన పరీక్షా మొదలవనుంది. ఈ వారం నాగార్జున మన్మథుడు 2 రిలీజ్‌ అవుతోంది కనుక సెకండ్‌ వీకెండ్‌లో ఎంత స్ట్రాంగ్‌గా నిలబడుతుందనేది ఈ చిత్రం భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఈమూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కి రావడానికి చాలా కావాలి. కానీ సినిమా బ్లాక్ బస్టర్ అని టీం హడావిడి స్టార్ట్ చేసేసింది.

టైంపాస్ కోసమని తెలియక….

చాలా కాలం తరువాత మీడియా ముందు కి వచ్చిన బెల్లంకొండ సురేష్ తన కొడుకుని బాలీవుడ్ లాంచ్ చేయాలనీ చూస్తున్నాం అని చెప్పాడు. బాలీవుడ్ లో శ్రీనివాస్ సినిమాలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. శ్రీనివాస్ నటించిన సినిమాలన్నీ హిందీ డబ్బింగ్‌ వ్యూస్‌ బాగా వస్తున్నాయని అతనికి అక్కడ మార్కెట్‌ వుందని భ్రమ పడుతున్నాడు. కానీ గమించాల్సిన విషయం ఏంటంటే అక్కడ డిజాస్టర్ సినిమాకి కూడా కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. అక్కడ జనాలు టైం పాస్ కోసం మన డబ్బింగ్ సినిమాలు చూస్తుంటారు. ఫ్రీ గా యూట్యూబ్ ని చూడొచ్చు కాబట్టి ఏ సినిమా అయినా చూస్తున్నారు అక్కడ జనాలు. అందుకే వ్యూస్ వస్తున్నాయి. అలా ఫ్రీ గా చూసే యూట్యూబ్ లో వ్యూస్ చూసుకుని స్టార్ అనుకుంటే ఎలా? ముందు ఇక్కడ మార్కెట్ సంపాదించుకుని అప్పుడు బాలీవుడ్ గురించి మాట్లాడితే కరెక్ట్.

Tags:    

Similar News