వారిద్దరి క్రేజ్ కలిసొస్తుందా..?

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే బడా నిర్మాత కొడుకు. కొడుకుని హీరోగా నిలబెట్టడానికి బెల్లంకొండ సురేష్ ఇప్పటికీ భారీ బడ్జెట్ పెడుతూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాను షాడో [more]

Update: 2019-04-16 06:20 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే బడా నిర్మాత కొడుకు. కొడుకుని హీరోగా నిలబెట్టడానికి బెల్లంకొండ సురేష్ ఇప్పటికీ భారీ బడ్జెట్ పెడుతూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాను షాడో నిర్మాతగా ఉంటూ ఇతర నిర్మాతలతో కలిసి కుమారుడితో భారీగా సినిమాలు చేస్తున్న సురేష్.. కొడుకు క్రేజ్ తో వర్కౌట్ కాదని టాప్ హీరోయిన్ల ని తీసుకొస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తో జోడికట్టిన ఏకైన యావరేజ్ హీరో శ్రీనివాస్. ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక్క హిట్ కూడా లేదు. అయినా బెల్లంకొండ చిత్రాలకు క్రేజ్ ఉంటుంది. కారణం ఆ సినిమాలు చేసే దర్శకులు, హీరోయిన్లు.

కాజల్, తేజ క్రేజ్ తోనే…

తాజాగా శ్రీనివాస్ నటించిన సీత సినిమా రేపు 25న విడుదల కాబోతుంది. తేజ దర్శకత్వంలో కాజల్ మెయిన్ లీడ్ లో శ్రీనివాస్ నటించిన సీత సినిమాపై ట్రేడ్ లో ఆసక్తి ఉంది. నేనే రాజు నేనే మంత్రి హిట్ తో తేజ, కాజల్ క్రేజ్ ఇందుకు కారణం. అందుకే సీత సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఏకంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. బెల్లంకొండ సినిమా అంటే.. రిచ్ నెస్ తో పాటు హిట్ డైరెక్టర్, టాప్ హీరోయిన్ ఉంటారు. అందుకే శ్రీనివాస్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. ఇక ట్రేడ్ లో సీత సినిమా మీద క్రేజ్ రావడానికి కారణం కాజల్, తేజలే. మరి శ్రీనివాస్ ఇంకెన్నాళ్లు దర్శకుడు, హీరోయిన్ మీద ఆధారపడతాడో చూడాలి.

Tags:    

Similar News