హిట్ అయినా… బ్రేక్ ఈవెన్ కష్టమే

కెరీర్ లో మొట్టమొదటిసారిగా సూపర్ హిట్ అందుకున్నాడు మన బెల్లంకొండ బాబు. భారీ బడ్జెట్ తో భారీ డైరెక్టర్స్ తో సినిమాలు చేసిన రాని హిట్ట్టు.. ఒకే [more]

Update: 2019-08-05 07:47 GMT

కెరీర్ లో మొట్టమొదటిసారిగా సూపర్ హిట్ అందుకున్నాడు మన బెల్లంకొండ బాబు. భారీ బడ్జెట్ తో భారీ డైరెక్టర్స్ తో సినిమాలు చేసిన రాని హిట్ట్టు.. ఒకే ఒక్క రీమేక్ చేస్తే వచ్చేసింది. తమిళ సినిమాని తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. ఇక శని ఆది వారాల్లోనూ రాక్షసుడు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అంటే మరీ అంత సూపర్ కాకపోయినా… థియేటర్స్ ఆక్యుపెన్సీ బాగానే ఉంది. కాకపోతే వరసగా కురుస్తున్న వర్షాలు బెల్లంకొండ ఆనందాన్ని ఆవిరి చేసేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరసగా నాలుగురోజులనుండి పట్టిన ముసురుకి థియేటర్ కి వెళ్లి సినిమా చూసేంత సీన్ కనబడడం లేదు.

సినిమా బాగా ఉన్నా…..

మరి వీకెండ్ లో పర్వాలేదనిపించినా… రాక్షసుడు వీక్ డేస్ మొదలయ్యాక వీకవ్వడం ఖాయమంటున్నారు. పాపం హిట్టయిన ఆనందంలో బెల్లంకొండ శ్రీనివాస్ తెగ సంతోష పడిపోతున్నాడు కానీ.. సినిమా కి థియేట్రికల్ రైట్స్ తో వచ్చిన 13.50 కోట్లు రావడం కష్టమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి హిట్ అని సంబరపడిపోతున్న రాక్షసుడు టీం కి ఇది కాస్త బాధకలిగించే విషయమే. సినిమా కి మంచి మార్కులు వేసిన ప్రేక్షకులు ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మళ్ళీ మళ్ళీ సినిమా చూసేందుకు సిద్దపడరు. ఇక ఈ వారంలో రాక్షసుడు బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే శుక్రవారం మన్మధుడు 2 తో నాగార్జున థియేటర్స్ ని ఆక్యుపై చేస్తాడు. ఈలోపే రాక్షసుడు గట్టిగ కొట్టాలి.. లేదంటే హిట్ అయినా వెస్ట్.

Tags:    

Similar News