బెల్లంకొండ ని వెంటాడుతున్న 2 అంశాలు

అల్లుడు శ్రీను ఎక్కడ రాక్షసుడు ఎక్కడ? ఈ రెండు సినిమాలకి చాలా గ్యాప్ ఉంది. కెరీర్ లో చాలా గ్యాప్ తరువాత మొదటి హిట్ అందుకున్న బెల్లంకొండ [more]

Update: 2019-08-04 07:20 GMT

అల్లుడు శ్రీను ఎక్కడ రాక్షసుడు ఎక్కడ? ఈ రెండు సినిమాలకి చాలా గ్యాప్ ఉంది. కెరీర్ లో చాలా గ్యాప్ తరువాత మొదటి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ ఆనందం ఎంతో సేపు పట్టలేదు. ముఖ్యంగా బెల్లంకొండ ని రెండు విషయాలు నిరాశ పెడుతున్నాయి.

అందులో ఒకటి హిందీ డబ్బింగ్ రైట్స్. అతని సినిమా ఎలా ఉన్న హిందీ లో సూపర్ హిట్ అవుతుంది. మంచి రేట్ కి కూడా అమ్ముడుపోతుంది. ఎందుకంటే అతను ఇప్పటి దాకా చేసిన సినిమాలు అన్నిట్లో యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి. కానీ అతను నటించిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు హిందీ డబ్బింగ్ రైట్స్ అక్కడ ఓ నిర్మాత కొన్నాడు. కానీ సినిమాలో థ్రిల్లర్ అంశాలు తప్ప యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడంతో అతను నిర్మాతలతో పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది.

మరొక విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినా సాయంత్రానికే పైరసీ లీక్ అయింది. దింతో బెల్లంకొండ కి మరిన్ని చిక్కులు తప్పలేదు. ఇలా ఈ రెండు అంశాలు ఇప్పుడు బెల్లంకొండకు టెన్షన్ తెప్పిస్తున్నాయి

Tags:    

Similar News