అటుఇటు కాకుండా అయిపోయిన బెల్లంకొండ

ఇస్మార్ట్ శంకర్ టైములో రిలీజ్ అవ్వాల్సిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు. కానీ బెల్లంకొండ రేంజ్ కి ఇస్మార్ట్ శంకర్ పెద్ద సినిమా కాబట్టి సైడ్ కి [more]

Update: 2019-07-23 07:40 GMT

ఇస్మార్ట్ శంకర్ టైములో రిలీజ్ అవ్వాల్సిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు. కానీ బెల్లంకొండ రేంజ్ కి ఇస్మార్ట్ శంకర్ పెద్ద సినిమా కాబట్టి సైడ్ కి వెళ్ళాడు. ఏకంగా రెండు వారల అవతలికి వెళ్ళాడు బెల్లం బాబు. ఆగష్టు 2 న రాక్షసుడు సినిమా రిలీజ్ కానుంది. ఈసినిమాకి వారం కి ముందు యంగ్ అండ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది.

విజయ్ క్రేజ్ గురించి తన మార్కెట్ గురించి వేరే చెప్పనవసరం లేదు. డియర్ కామ్రేడ్ ఎలాగో ఓపెనింగ్స్ వచ్చేస్తాయి.కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ పరిస్థితి అలాంటిది కాదు. మొదటి నుండి ఫుల్ డౌన్ లో ఉన్న శ్రీనివాస్ సినిమా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం చాల కష్టం. సినిమా బాగుందని టాక్ వచ్చి బాగా ప్రమోట్ చేస్తే తప్ప. కష్టమే అంటున్నారు ట్రేడ్ వారు.

పైగా ఈసినిమాకి పోటీగా గుణ 369 సినిమా ఉంది. సో ఓపెనింగ్స్ కష్టమే. రాక్షసుడు వచ్చిన వారానికి నాగార్జున మన్మధుడు 2 సినిమా వచ్చేస్తోంది. అంటే ముందు వారాలు, వెనుక వారాలు కూడా ఫుల్ కాంపిటీషన్ నే. ఇక ఆగస్టు 15 న శర్వానంద్ రణరంగం, అడవి శేష్ ఎవరు సినిమాలు వున్నాయి. ఇలా మధ్యలో నలిగిపోతున్నాడు శ్రీనివాస్. అసలే హిట్ లేక తమిళ సినిమా ని రీమేక్ చేసి హిట్ కొడదాం అంటే సినిమాల పోటీ తప్పడమేలేదు.

Tags:    

Similar News