రాక్షసుడు-గుణ 369 గోల్డెన్ ఛాన్స్

ఈ శుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ అందులో రెండిటి మధ్యే పోటీ. బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న చిత్రం రాక్షసుడు. ఈచిత్రం తమిళ [more]

Update: 2019-07-30 07:08 GMT

ఈ శుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ అందులో రెండిటి మధ్యే పోటీ. బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న చిత్రం రాక్షసుడు. ఈచిత్రం తమిళ చిత్ర రీమేక్ గా వస్తుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయినా ఈచిత్రం పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఆల్రెడీ ఈసినిమాను తమిళంలో చాలామంది తెలుగు ప్రేక్షకులు చూసేసారు. అయినా కానీ తెలుగు లో కూడా ఎలా తీశారు అని చూడనున్నారు. ఇది థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ.

ఇక దీని పాటు మరో యాక్షన్ ఎంటర్టైనర్ రానుంది.అదే గుణ 369. RX 100తో సెన్సేషన్ హిప్పీతో డిజాస్టర్ రెండూ టేస్ట్ చేసిన కార్తికేయకు దీని సక్సెస్ చాలా అవసరం. బోయపాటి శిష్యుడు ఈసినిమాను డైరెక్ట్ చేసాడు. ట్రైలర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రామిసింగ్ గా అనిపించడం యూనిట్ కి రిలీఫ్ కలిగిస్తోంది. ఈ రెండు సినిమాలకి ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల ఇస్మార్ట్ శంకర్ రన్ ముగిసిపోయింది. అలానే డియర్ కామ్రేడ్ నాలుగో రోజుకే వీకవ్వడం బయ్యర్లకు గుబులు పుట్టిస్తోంది. స్లో గా రన్ అవుతుంది. సో ఈనేపధ్యంలో రాక్షసుడు-గుణ 369 కనక కంటెంట్ తో మెప్పిస్తే వీక్ ఎండ్ తో పాటు మన్మథుడు 2 వచ్చేదాకా టికెట్ కౌంటర్లను దున్నేయొచ్చు. చూద్దాం ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో..

Tags:    

Similar News