బెల్లంకొండ శ్రీనివాస్ ఇంక కష్టమేనా?

Update: 2018-12-12 08:57 GMT

తన మొదటి సినిమాతోనే భారీ గా లాంచ్ అయినా బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు తనకు ఒక్క హిట్ కూడా లేదంటే ఆశర్యపోవాల్సిందే. తన ప్రతీ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయిపోవడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ పర్లేదు అనిపించుకున్న ఆ తరువాత నుండి వసూల్ బాగా డల్ అయిపోతున్నాయి. గత వారం రిలీజ్ అయినా 'కవచం' పరిస్థితి కూడా అంతే. మొదటి రోజు ఓపెనింగ్స్ పర్లేదు అనిపించుకున్న రెండు రోజు నుండి వీకెండ్స్ లో వసూళ్లు పడిపోయాయి.

'అల్లుడు శ్రీను'..'జయ జానకి నాయక’ సినిమాలు పర్లేదు అనిపించుకున్న బడ్జెట్లు ఎక్కువ అయిపోవడంతో ఫెయిల్యూర్లుగానే నిలిచాయి. ఆ తరువాత వచ్చిన ‘సాక్ష్యం’ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన 'కవచం' బడ్జెట్ తక్కువ అయినప్పటికీ కాస్టింగ్..ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే బాగానే ఖర్చు పెట్టినట్లుగా కనిపించింది. సో ఈసినిమా కూడా కనపడని బడ్జెట్ అయింది.

సినిమాలు ఆడకపోతున్న శ్రీనివాస్ పై ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారో అర్ధం కావట్లేదు. తన మార్కెట్ తెలిసి కూడా మన ప్రొడ్యూసర్స్ ఓవర్ బడ్జెట్..ఓవర్ కాస్టింగ్ ఎందుకు చేస్తున్నారో అర్ధం అవ్వట్లేదు. సినిమా రిలీజ్ అయినా తరువాత లాస్ వచ్చినా ఎవ్వరూ నష్టాల గురించి కనీసం బాధపడటం కూడా కనిపించదు. మరి మన ప్రొడ్యూసర్స్ ఇతనిపై ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారు అంటే...ఈ నిర్మాతలు కొంత మేర ఖర్చు పెట్టుకుంటే.. కొంత బెల్లంకొండ సురేష్ సమకూరుస్తాడని.. బిజినెస్, ప్రమోషన్, రిలీజ్.. ఈ బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.

ఈ బాధ్యతలన్నీ బెల్లంకొండ సురేష్ చూసుకుంటున్న మిగిలిన తమ వాటాగా ఎంత తక్కువ ఖర్చు పెట్టుకున్నా కూడా వర్కవుట్ కావట్లేదు. అతడితో సినిమా చేస్తే అసలు మిగిలకపోవడంతో..వెనక్కి తగ్గుతున్నారు ప్రొడ్యూసర్స్. ప్రస్తుతానికి అయితే శ్రీనివాస్ చేతిలో ఒక సినిమా ఉంది. ఈసినిమా తరువాత ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ తో సినిమా చేసే పరిస్థితులు లేవు. పోనీ తన తండ్రి డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఫైనాన్స్ సమస్యల వల్ల ఆలా చేయలేడు. మరి ఏమి చేస్తారో చూడాలి. మనోడికి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువట. సినిమాకి 3 - 4 కోట్లు వరకు తీసుకున్నాడని సమాచారం.

Similar News