వైజాగ్ లో అదిరిపోయిందిగా?

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఏదైనా హిట్ ఉందంటే అది రీసెంట్ గా వచ్చిన రాక్షసుడు. అనుపమ హీరోయిన్ గా నటించిన ఈసినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ [more]

Update: 2019-08-12 06:54 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఏదైనా హిట్ ఉందంటే అది రీసెంట్ గా వచ్చిన రాక్షసుడు. అనుపమ హీరోయిన్ గా నటించిన ఈసినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేసాడు. తొలి వీకెండ్ తో పోల్చుకుంటే రెండో వీకెండ్ కాస్త వీక్ అయింది. దాంతో బ్రేక్ ఈవెన్ సమస్య ఏమైనా వస్తుందేమో అని భయపడ్డారు కానీ విచిత్రంగా నాగ్ సినిమా మన్మధుడు 2 డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా కి ఫుల్ ప్లస్ అయింది.

దాంతో అంత ఈసినిమానే చూస్తున్నారు. ఇక ఈమూవీ వైజాగ్ ఏరియా లో ఇప్పటికే కోటిన్నర షేర్ దాటేసింది. త్వరలోనే రెండు కోట్లు వస్తుందని బయ్యర్ ధీమాగా ఉన్నాడు. ఒక్క వైజాగ్ మాత్రమే కాదు అన్ని ఏరియాస్ లో ఈసినిమా స్ట్రాంగ్ గా నడుస్తుంది. ఇది ఒక తమిళ చిత్రం కి రీమేక్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈసినిమా ఘాన విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో నిర్మాత కొనేరు సత్యనారాయణ అర్జెంట్ గా తమిళనాడు సినిమాల మీద కన్నేసారు. తమిళంలో ఏమైనా సినిమా నచ్చితే దాన్ని తెలుగు లో రీమేక్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు.

Tags:    

Similar News