బెల్లంకొండ శ్రీనివాస్ బాలయ్య సినిమాలో..!

రెండు సినెమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేసరికి బోయపాటి – బాలయ్య కాంబో పై ఎక్కడలేని అంచనాలు వచ్చేసాయి. ముచ్చటగా తెరకెక్కబోయే మూడో కాంబోపై అందరిలో ఇంట్రెస్ట్ [more]

Update: 2020-07-29 05:29 GMT

రెండు సినెమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేసరికి బోయపాటి – బాలయ్య కాంబో పై ఎక్కడలేని అంచనాలు వచ్చేసాయి. ముచ్చటగా తెరకెక్కబోయే మూడో కాంబోపై అందరిలో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికే విడుదలైన #BB3 టీజర్ అందరిలో భీబత్సమైన అంచనాలు పెంచేసింది . అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ఘోరంగా అదరగొట్టేస్తాడని, సెకండ్ హాఫ్ లో అఘోర పాత్రలో బాలయ్య చెయ్యబోయే రచ్చ అంత ఇంట కాదని..అదే సినిమాకి మెయిన్ హైలెట్ అంటున్నారు. ఈ సినిమా లో బాలయ్య కోసం బోయపాటి ముంబై మోడల్ ని తీసుకురాబోతున్నాడనే స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్ ఏంటంటే ఈ సినిమాలో బెల్లకొండ శ్రీనివాస్ ఓ స్పెషల్ కేరెక్టర్ చేస్తున్నాడని, ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ వస్తాడని, బోయపాటి ఓ యాక్షన్ ఎపిసోడ్ ని బెల్లంకొండ శ్రీనివాస్ కి రాసుకున్నడని అంటున్నారు. బెల్లంకొండ తో గతంలో బోయపాటి జయ జానకి నాయక సినిమా చేసాడు. అయితే బోయపాటి అడగగానే బెల్లంకొండ శ్రీనివాస్ బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడని టాక్ ఉండగా.. ఈ సినిమాలో బాలయ్య ఇంకో కేరెక్టర్ కి తమిళ హీరోయిన్ స్నేహ నటిస్తుందట. ఇందులో బాలయ్య భార్యగా స్నేహ నటిస్తుందనేది తాజా న్యూస్.

Tags:    

Similar News