సాహో టీజర్ అలా కట్ చేయడానికి కారణం అదే!

హీరోయిన్స్ కి ప్రాధాన్యం తగ్గుతున్న రోజుల్లో ప్రభాస్ చేస్తున్న సాహో చిత్రం లో శ్రద్ధా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని..కథ మొత్తం హీరోయిన్ పాత్ర పైనే డ్రైవ్ [more]

Update: 2019-06-26 17:31 GMT

హీరోయిన్స్ కి ప్రాధాన్యం తగ్గుతున్న రోజుల్లో ప్రభాస్ చేస్తున్న సాహో చిత్రం లో శ్రద్ధా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని..కథ మొత్తం హీరోయిన్ పాత్ర పైనే డ్రైవ్ అవుతుందని సుజీత్ అంటున్నాడు. అన్ని సినిమాల్లో హీరోయిన్స్ మాదిరిగా ఈసినిమాలో శ్రద్ద పాత్ర ఉండదని చెబుతున్నాడు.

ఇక రీసెంట్ గా రిలీజైన సాహో టీజర్ కట్ విషయం సుజీత్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయట. ఒకటి టీజర్ స్టార్టింగ్ లో ప్రభాస్ ని చూపించడం..మరొకటి శ్రద్ధా సీన్ తో ప్రారంభించడం. అయితే చివరికి శ్రద్ద తోనే స్టార్ట్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు సుజీత్. దీనికి కారణం ప్రభాస్ పెద్ద స్టార్ అయినా.. అందరి దృష్టి ప్రభాస్ పై ఉంటుందని తెలిసినప్పటికీ హీరోయిన్ కు ప్రాముఖ్యత ఉంటుందనే మెసేజ్ ప్రేక్షకులకు ఇవ్వడమేనట.

ఇందులో శ్రద్ద యాక్షన్ సీన్స్ డూప్ లేకుండా నటించిందని సమాచారం. ఇటువంటి యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. ఒకవేళ ఇది నిజం అయితే ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరణ దక్కుతుంది. ఆగస్టు 15 న ఈమూవీ రిలీజ్ అవ్వంబోతుంది.

Tags:    

Similar News