బాలయ్య సెకండ్ గెటప్ పై మరో న్యూస్

బోయపాటి – బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న BB3 (గాడ్ ఫాదర్) పై అంచనాలు ఉన్నాయి. ట్రేడ్ లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ, ఫాన్స్ లోను అంచనాలు ఉన్నాయి. ఇక [more]

Update: 2021-03-04 05:40 GMT

బోయపాటి – బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న BB3 (గాడ్ ఫాదర్) పై అంచనాలు ఉన్నాయి. ట్రేడ్ లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ, ఫాన్స్ లోను అంచనాలు ఉన్నాయి. ఇక BB3 లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తాడు అనేది అందరికి తెలిసిందే. BB3 టీజర్ రిలీజ్ అప్పుడే బాలయ్య చెయ్యబోతున్న పవర్ ఫుల్ రోల్ మీద అందరికి ఓ ఐడియా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ రెండో గెటప్ మీద కొంత కన్ఫ్యూషన్ ఉంది. ఎందుకంటే ముందుగా బోయపాటి బాలయ్య ని అఘోర గెటప్ లో కొత్తగా చూపించబోతున్నాడని అనుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో అఘోర గెటప్ సన్నివేశాల షూటింగ్ జరిగినట్టుగా ప్రచారం జరిగింది.

అయితే బాలకృష్ణ BB3 లో గాడ్ ఫాదర్ గా 70 ఏళ్ళ వృద్ధుడి గెటప్ లో కనిపించబోతున్నాడని, అసలు BB3 లో బాలయ్య సెకండ్ గెటప్ ఏమిటి అనేది బాలయ్య ఫాన్స్ కి కూడా అంతుబట్టడం లేదు. కాకపోతే బాలయ్య ఏ గెటప్ లో కనిపిస్తాడు, ఎలాటి కేరెక్టర్ చెయ్యబోతున్నారు అనేది బాలయ్య అభిమానులు ఊహిస్తున్న విషయం. బోయపాటి – బాలయ్య కూడా BB3 లో సెకండ్ గెటప్ విషయం రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెకండ్ గెటప్ కి సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ మొదలయ్యింది. షూటింగ్ లోకి ఎవరిని సెల్ ఫోన్ తో ఎలవ్ కూడా చెయ్యడం లేదు.

Tags:    

Similar News