ఎవ్వరు చెప్పినా కుదరదంటున్నాడట..!

రామ్ చరణ్ వినయ విధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం వచ్చింది. దీంతో హీరో రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ [more]

Update: 2019-02-18 06:45 GMT

రామ్ చరణ్ వినయ విధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం వచ్చింది. దీంతో హీరో రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ నుండి 5 కోట్లు, అలానే నిర్మాత దానయ్య కూడా 5 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అలానే బోయపాటి కూడా తన రెమ్యూనరేషన్ నుండి 5 కోట్లు ఇవ్వాలని అడిగితే దానికి అతను అంగీకరించకపోవడంతో నిర్మాత దానయ్యకు, బోయపాటి కి మధ్య వాగ్యుద్ధానికి దారి తీసిందనే పుకార్లు వినిపించాయి. అయితే ఈ సెటిల్‌మెంట్‌ వ్యవహారాన్ని మధ్యవర్తులుగా అల్లు అరవింద్, దిల్ రాజు మాట్లాడి బోయపాటికి నచ్చచెప్పడంతో ఆయన కోటి రూపాయలు ఇస్తా అని చెప్పాడు. కానీ నిర్మాత దానయ్య తో వచ్చిన విబేధాల కారణంగా అసలు పైసా కూడా తిరిగి ఇచ్చేది లేదని బోయపాటి తేల్చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఇన్వాల్వ్ అయినా…

తాను పని చేసిన దానికే రెమ్యూనరేషన్ తీసుకున్నానని… అంతే కానీ రూపాయి కూడా వెనక్కు ఇచ్చేదిలేదని… నష్టాలు, లాభాలు అనేవి పూర్తిగా నిర్మాతే చూసుకోవాలని తెగేసి చెప్పాడట. అలానే బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చిన కొంతమంది నిర్మాతలు ఆ అడ్వాన్స్ లు తిరిగి వెనక్కి ఇచ్చేయమని అడుగుతున్నారని సమాచారం. అయితే బోయపాటి ఒక స్టార్‌ హీరో డేట్స్‌ తెచ్చి సినిమా చేయడం తన పూచీ అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వట్లేదు అని వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News