బాషా సీక్వెల్ వద్దన్నాడట..!

Update: 2018-06-27 09:20 GMT

రజనీకాంత్ కెరీర్ లో బాషా చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమా వచ్చాక అలాంటి బ్యాక్ డ్రాప్ లో లెక్కలేనన్ని సినిమాలు తెరకెక్కాయి. ఆ సినిమాలో బాషా గా రజినీకాంత్ అదిరిపోయే పర్ ఫార్మెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. డాన్ గా ఉన్న బాషా తన తండ్రి మాట కోసం మాములు ఆటో డ్రైవర్ గా తల్లిని చెల్లిని, తమ్ముడిని చదివించే క్యారెక్టర్ లో రజనీ అదరగొట్టాడు. అయితే ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు చేస్తున్న రజినీకాంత్ కాలా సినిమా తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

అటువంటి కథలకు దూరంగా ఉంటున్నా...

అయితే రజనీ బాషాకి సీక్వెల్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఒక తమిళ దర్శకుడు రజనీకాంత్ ని కలిశాడట. మొట్ట శివ కెట్ట శివ సినిమా డైరెక్టర్ సాయి రమణి, రజనీకాంత్ ని కలిసి బాషాకి సీక్వెల్ చేద్దామని అడగడమే కాదు.. తన దగ్గరున్న కథని కూడా రజనీకి వినిపించాడట. అసలు సాయి రమణికి రజినీకాంత్ తో బాషా సీక్వెల్ చెయ్యాలనే కోరిక ఇప్పటిది కాదట. అయితే కథ విన్న రజనీ కథ బాగుంది కానీ బాషా లాంటి సినిమాని మళ్లీ టచ్ చేయకపోవడమే కరెక్ట్... అయినా ప్రస్తుతం అలంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలకు తాను దూరంగా ఉన్నానని... బాషా సీక్వెల్ ప్రపోజల్ ని రజనీ రిజెక్ట్ చేసాడట. అయితే బాషా సీక్వెల్ చెయ్యకపోయినా... మరో మంచి స్టోరీ లైన్ తో వస్తే మాత్రం తప్పక అతనికి సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చాడట. ఇక సాయి రమణి.. రజనీ మాటందుకుని వేరే కొత్త కథని ప్రిపేర్ చేసే పనిలో నిమగ్నమయ్యాడనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.

Similar News