బన్నీ ది పాన్ ఇండియా.. కానీ మహేష్ ది అలా కాదు!!

ఈ ఏడాది మహేష్ బాబు – సరిలేరు నీకెవ్వరూ సినిమా, బన్నీ అలా వైకుంఠపురములో సినిమాలు సంక్రాతి పోరులో పోటీ పడడం.. ముందు నుండి రెండు సినిమాలపై [more]

Update: 2020-06-04 10:50 GMT

ఈ ఏడాది మహేష్ బాబు – సరిలేరు నీకెవ్వరూ సినిమా, బన్నీ అలా వైకుంఠపురములో సినిమాలు సంక్రాతి పోరులో పోటీ పడడం.. ముందు నుండి రెండు సినిమాలపై ఆసక్తికర పోటీ ఉండడంతో.. విడుదలయ్యాక కూడా ఆ రెండు సినిమాలు జనాల్లో పిచ్చ క్రేజ్ రావడం.. ఆ క్రేజ్ తో అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అయితే మహేష్ సరిలేరు సూపర్ హిట్ అయ్యింది. అయితే తాజాగా మహేష్ – బన్నీ బాక్సాఫీసు పోరు మరోసారి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు – అల్లు అర్జున్ ఒకేసారి సినిమాలు మొదలెట్టేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. మహేష్ సర్కారు వారి పాట. బన్నీ పుష్ప రెండూ ఒకేసారి పట్టాలెక్కబోతున్నాయి.  పరశురామ్ – మహేష్ పక్కా ప్లానింగ్ తో పట్టాలెక్కుతుంటే.. సుకుమార్ – అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్ కి సినిమాని రెడీ చేసుకుని కూర్చున్నారు.

ఒకరి మీద ఒకరు పోటీతో సినిమాలను ఫినిష్ చేసి వచ్చే ఏడాది వేసవికి ఒకే నెలలో కొద్దిగా అటు ఇటుగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినబడుతుంది. అయితే సుకుమర్ తో సినిమా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే బన్నీ ది పాన్ ఇండియా మూవీ. అందులోను సుక్కు చెక్కిందే చెక్కి చెక్కిందే చెక్కుతాడు. పరశురామ్ మహేష్ మూవీ జస్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబందించిన మూవీ కావడం.. పరశురామ్ అనుకున్న టైం కి సినిమాని లైన్ లో తేవడం పక్కా. అందుకే బన్నీ నెక్స్ట్ వేసవికి వస్తుందో.. రాదో కానీ.. మహేష్ మాత్రం పక్కాగా అభిమానులకు టచ్లో ఉంటాడంటున్నారు.

Tags:    

Similar News