జాతిరత్నాలు క్రేజ్ పెంచిన బన్నీ

నిన్న గురువారం మహాశివరాత్రి రోజున విడుదలైన జాతి రత్నాలు సినిమా కి హిట్ టాక్ పడింది. నవీన్ పోలిశెట్టి – ప్రియదర్శి – రాహుల్ రామ కృష్ణ [more]

Update: 2021-03-13 03:18 GMT

నిన్న గురువారం మహాశివరాత్రి రోజున విడుదలైన జాతి రత్నాలు సినిమా కి హిట్ టాక్ పడింది. నవీన్ పోలిశెట్టి – ప్రియదర్శి – రాహుల్ రామ కృష్ణ కాంబోలో తెరకెక్కిన జాతి రత్నాలు టైటిల్ కి తగ్గట్టే.. జాతి రత్నాలుగా సక్సెస్ కొట్టారు. సినిమా విడుదలైన కాసేపటికే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో సినిమా కి హిట్ టాక్ పడిపోయింది. ఇక గత రాత్రి జాతి రత్నాలు చూసిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయమే ట్వీట్ల వర్షం కురిపించాడు. రాత్రే ఈ సినిమా చూసాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. ఒక సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తూ  ఈ మధ్య కాలంలో ఇంత‌లా న‌వ్వ‌లేదు. 

న‌వీస్ పొలిశెట్టి నువ్వు నీ న‌టన‌తో అద‌ర‌గొట్టేశావు. రాహుల్ నువ్వు చాలా బ్రిలియంట్‌గా చేశావు. ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా అబ్దుల్లా అభినందించద‌గ్గ నటులు అంటూ ట్వీట్ చెయ్యడమే కాదు.. టెక్నీకల్ టీం ని పేరు పేరునా అల్లు అర్జున్ అభినందించాడు. జాతి రత్నాలు క‌థ‌ను న‌మ్మించినందుకు అశ్వ‌నీద‌త్‌, స్వ‌ప్నా సినిమాను, ప్రియాంక ద‌త్, ద‌త్ గారికి నా రెస్పెక్ట్. ఇక చివరిగా దర్శకుడు అనుదీప్ ఇంతిలా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన నీకు నా రెస్పెక్ట్. మీ బ్రెయిన్‌ని స్విచ్ఛాఫ్ చేసి.. జాతి రత్నాలు సినిమాను వెళ్లి ఫ‌న్‌ని ఎంజాయ్ చెయ్యండి అంటూ ట్వీట్ చెయ్యడం తో జాతి రత్నాలు టీం ఆనందంలో పొంగిపోతుంది.

Tags:    

Similar News