బన్నీ లుక్ మారిపోయిందిగా!

సుకుమార్ – బన్నీ కాంబినేషన్ లో వస్తున్నా పుష్ప పై అంచనాలు బాగానే ఉన్నాయి ప్రేక్షకుల్లో. పైగా సుకుమార్ – బన్నీ కాంబినేషన్ కాబట్టి మరింత అంచనాలు [more]

Update: 2020-05-08 10:51 GMT

సుకుమార్ – బన్నీ కాంబినేషన్ లో వస్తున్నా పుష్ప పై అంచనాలు బాగానే ఉన్నాయి ప్రేక్షకుల్లో. పైగా సుకుమార్ – బన్నీ కాంబినేషన్ కాబట్టి మరింత అంచనాలు ఉన్నాయి. ఇక బన్నీ తన లుక్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఇందుకోసం నాచురాలిటీ కోసం కత్తెర పడకుండా అలాగే చింపిరి జుట్టు, చింపిరి గడ్డం ఉంచేద్దాం అనుకున్నారు. పుష్ప కు సంబంధించి ఫోటోషూట్ నాటికి బన్నీకి పర్ఫెక్ట్ మేకోవర్ అయింది. ఇక షూటింగ్ కి వెళ్తున్న టైములో కరోనా వచ్చింది దాంతో షూటింగ్ కి బాగా గ్యాప్ రావడంతో బన్నీ కి జుట్టు, గడ్డం ఇంకా పెరిగింది.

దాంతో ఇప్పుడు బన్నీ కు కత్తెర వేయక తప్పడం లేదట. షూటింగ్ స్టార్ట్ ఆయేనాటికి పాత లుక్ ని తీసుకుని రావాలని చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయం లో సుకుమార్ కథను మరింత చేంజెస్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె పుష్ప కాస్ట్యూమ్స్ కోసం అల్లు అర్జున్ వేసుకునే బట్టలని టీలో నానబెట్టి ఒక రెండు రోజుల తర్వాత ఉతుకుతున్నారట. కేవలం నాచురల్ లుక్ కోసమే సుకుమార్ , బన్నీ ఇలా చేస్తున్నారు అని సమాచారం. లాక్ డౌన్ వెత్తివేయగానే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. హీరోయిన్ గా రష్మిక నటించనుంది.

Tags:    

Similar News