బండ్ల కు డేట్స్ ఇప్పించే పనిలో దిల్ రాజు

ఒక నిర్మాత మరో నిర్మాతకి హెల్ప్ చేయడం చాలా అరుదు గా చూస్తుంటాం. ఇప్పుడు టాలీవుడ్ లో అదే జరుగుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ [more]

Update: 2019-06-09 08:04 GMT

ఒక నిర్మాత మరో నిర్మాతకి హెల్ప్ చేయడం చాలా అరుదు గా చూస్తుంటాం. ఇప్పుడు టాలీవుడ్ లో అదే జరుగుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తో సినిమాలు తీసి మంచి ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్… ఎన్టీఆర్ తో టెంపర్ తరువాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. పాలిటిక్స్ అని వెళ్లిన గణేష్ తిరిగి మళ్లీ తన సొంత గూటికే చేరాడు.

మళ్లీ సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నాలు చేస్తున్న టైములో ఆయనకు ఎవరూ డేట్స్ ఇవ్వడం లేదని టాక్. హీరో నాని డేట్స్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు బోగట్టా. కానీ కుదరకపోవడంతో నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. ఆయన హీరో నానికి నచ్చ చెప్పి, డేట్ లు ఇప్పించే పనిలో పడ్డారు.

గణేష్ కు డేట్స్ ఇవ్వమని…తనదీ హామీ అని నిర్మాత దిల్ రాజు, ఫైనాన్షియర్ సత్యరంగయ్య నానికి నచ్చ చెబుతున్నట్లు బోగట్టా. అటు నాని కూడా తొందర పడకుండా తన వద్దకు మంచి కథ వస్తే డేట్స్ ఇస్తానని తాత్కాలికంగా మాట అయితే ఇచ్చినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. గణేష్ విషయంలో దిల్ రాజు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నాడో అర్ధం కానీ విషయం.

Tags:    

Similar News