బండ్ల కామెడీ.. రోజుకి ఐదు లక్షలు

మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ ట్రైన్ సెట్ [more]

Update: 2019-08-05 11:07 GMT

మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ ట్రైన్ సెట్ లో జరుగుతుంది. రష్మిక మందన్న మహేష్ కి జోడిగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి తో పాటుగా కమెడియన్ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈరోజు సోమవారం బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరూ లో మొదటిసారిగా షూటింగ్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం బండ్ల గణేష్ ఏకంగా రోజుకి ఐదు లక్షల పారితోషకం తీసుకుంటున్నట్లుగా ఫిలింనగర్ టాక్.

ఫన్నీ క్యారెక్టర్……

అయితే ఈ సినిమా లో మహేష్ తో పాటుగా బండ్ల గణేష్ కామెడీ పండిస్తాడని.. అతని కేరెక్టర్ చాలా ఫన్నీ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అనిల్ రావిపూడి బండ్ల కేరెక్టర్ ని ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. నోటికి ఏదొస్తే అది మాట్లాడే పాత్రను బండ్ల గణేష్ కోసం రాసాడని టాక్. మరి బండ్ల కామెడీ ని చూసి చాలా రోజులైంది. ఈ సినిమాతో బండ్ల గణేష్ మళ్ళీ తన టాలెంట్ ని బయటికి తీసి తనలోని కమెడియన్ తో అందరిని కడుపుబ్బా నవ్విస్తాడన్న మాట.ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాతి టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం మహేష్ చాలా కష్టపడుతున్నాడు.

Tags:    

Similar News