బాలయ్య కు హీరోయిన్ దొరికేసింది!

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈమూవీలో బాలయ్య కి జోడిగా ఏ హీరోయిన్ అనేది [more]

Update: 2019-06-23 15:34 GMT

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈమూవీలో బాలయ్య కి జోడిగా ఏ హీరోయిన్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు. చాలామంది హీరోయిన్స్ పేరులు అనుకున్నప్పటికీ ఎవరు సెట్ కాకపోవడంతో బాలయ్య ఓ హీరోయిన్ పేరు సజెస్ట్ చేసాడట. ఆమె శ్రియ

వీరి కాంబినేషన్ లో వచ్చినా సినిమాలు కొన్ని హిట్ కొన్ని ప్లాప్. తొలిసారి వీరు ‘చెన్నకేశవరెడ్డి’లో కలిసి నటించారు. ఆ తరువాత ‘విజయేంద్రవర్మ’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్‌’చిత్రాల్లో నటించారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ కథానాయకుడు లో కూడా శ్రియ ఓ చిన్న పాత్ర చేసింది.

అందుకే మరోసారి శ్రీయ నే హీరోయిన్ అయితే బాగుంటదని ఆమెతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాదాపుగా శ్రీయ నే ఓకే చేసే అవకాశముంది. ఈమూవీ లో మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది. ఆమె కూడా త్వరలోనే ఫైనల్ కానుంది. జులై లో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లుంది.

Tags:    

Similar News