క్రేజీ కాంబోకి అన్ని సిద్ధం?

Update: 2018-05-25 10:03 GMT

ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కన పెట్టేసిన బాలయ్య ప్రస్తుతానికి వి వి వినాయక్ తో ఒక రీమేక్ సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత సి కళ్యాణ్ ఎప్పటికపుడు అప్ డేట్స్ ఇస్తున్నాడు. కానీ అసలు చిక్కల్లా బాలయ్య - బోయపాటి కాంబో మీదే నెలకొంది. ఎందుకంటే బాలకృష్ణ - బోయపాటి సినిమా ఎప్పుడో సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది. కానీ బాలయ్యేమో బోయపాటిని కాదని ఎవరెవరికో అవకాశాలిస్తున్నాడు. ఇక బోయపాటి చేసేది లేక వేరే హీరోలతో కమిట్ అవుతూ వస్తున్నాడు. అయితే గత రెండు మూడు నెలలుగా బాలయ్య - బోయపాటి సినిమాపై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక బోయపాటి అయితే బాలయ్య తో సినిమా ఉంటుందని అనేక ఇంటర్వూల‌లో చెబుతున్నాడు. కానీ బాలయ్యే ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు.

రాజ‌కీయ నేప‌థ్యంతో...

అయితే తాజాగా బాలకృష్ణ - బోయపాటి సినిమాకు బాలయ్య పుట్టినరోజు అంటే జూన్ 10 న ముహూర్తం కుదిరిందని అంటున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌ ఉన్న కథని బోయపాటి తయారు చేసుకుని బాలకృష్ణ కి వినిపించగా బాలయ్య కథని మెచ్చి సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని తెలిసింది. అందుకే బాలయ్య పుట్టినరోజు నాడే బోయపాటి - బాలయ్య సినిమా పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయంటూ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తుంది. ఇంతకుముందు బాలయ్య - బోయపాటి లు కలిసి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

ఎన్నిక‌లకు ముందు ప్ర‌భంజ‌న‌మే..

ఇక బోయపాటి రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే బాలయ్య సినిమాతో సెట్స్ మీదకెళతాడని బాలయ్య కూడా ఈలోపు వినాయక్ సినిమా కూడా కంప్లీట్ చేసుకుంటాడని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు లెజెండ్ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు 2019 ఎన్నికల ముందు వీరి కాంబోలో వచ్చే సినిమా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నందమూరి ఫాన్స్ నమ్ముతున్నారు.

Similar News