బాలయ్య ఉప్పెన కి బూస్ట్ ఇచ్చాడా?

ఉప్పెన సూపర్ సక్సెస్ తో మంచి జోరు మీదున్న మైత్రి మూవీ యూనిట్ లో మరింత జోష్ నింపారు నందమూరి బాలకృష్ణ. అతి త్వరలో మైత్రి మూవీ [more]

Update: 2021-02-22 03:39 GMT

ఉప్పెన సూపర్ సక్సెస్ తో మంచి జోరు మీదున్న మైత్రి మూవీ యూనిట్ లో మరింత జోష్ నింపారు నందమూరి బాలకృష్ణ. అతి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానేర్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ ప్రస్టేజియస్ ఫిలిం చెయ్యబోతున్న బాలకృష్ణ తన నిర్మాతలకు తాజాగా దక్కిన ఘన విజయాన్ని అభినందిస్తూ ప్రత్యేకించి ఉప్పెన సినిమాని తన ఫ్యామిలీతో కలిసి వచ్చి మరీ చూసారు. అంతేకాకుండా సినిమా యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడంతో మైత్రి మూవీ అధినేతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయాన్నీ మైత్రి వారు ట్విట్టర్ లో సగర్వంగా ప్రకటించుకుని ఫోటో తో సహా పోస్ట్ చేసారు.  
కొత్తగా వచ్చే హీరోలను ఎప్పుడూ ప్రోత్సహించే బాలకృష్ణ మెగా హీరోని ఆ యూనిట్ ని అభినందించడం బాలకృష్ణ పెద్ద మనసుకి, మంచి గుణానికి ఇదొక నిదర్శనం అని కాంప్లిమెంట్ ఇచ్చుకోవచ్చు. 

Tags:    

Similar News