ఏంటి బాలయ్య.. ఈ హంగామా

జూన్ 10 న నటసింహం నందమూరి బాలకృష్ణకు 60 ఏళ్లు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు కామన్ డిస్ప్లే పిక్చర్ (డిపి) ను రూపొందించారు. అయితే బాలకృష్ణ [more]

Update: 2020-06-06 08:35 GMT

జూన్ 10 న నటసింహం నందమూరి బాలకృష్ణకు 60 ఏళ్లు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు కామన్ డిస్ప్లే పిక్చర్ (డిపి) ను రూపొందించారు. అయితే బాలకృష్ణ తాజా చిత్రాలకు బదులుగా అభిమానులు రెట్రోకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కామన్ డిపిలో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 నుండి శ్రీ కృష్ణదేవేరాయలు గెటప్ అలాగే నిప్పురవ్వ లో బాలయ్య గెటప్ లను సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేసారు. అయితే అభిమానులు ఇప్పుడు కొత్త చిత్రాలకు బదులుగా పాత చిత్రాల నుండి ఫొటోస్ ని ఎందుకు ఇష్టపడతున్నారో అనేది స్పష్టంగా తెలియకపోయినా… ఇప్పుడు అభిమానుల నుండి బయటికొచ్చిన ఈ కామన్ డిపి బాలకృష్ణ యొక్క అందమైన ఆకర్షణీయమైన రూపాలతో అద్భుతంగా వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య కామన్ డిపి ని అయన అభిమానులే కాదు… ఇండస్ట్రీ లో బాలయ్య తో చనువుగా, బాలయ్యని అభిమానించేవారు కూడా తెగ లైక్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ కామన్ డిపి అలా ఉంచితే బాలకృష్ణ తన జూన్ 10 న తన 60 వ పుట్టిన రోజునాడు తన ఫ్యామిలీస్ అంటే నందమూరి ఫ్యామిలీతో కలిపి.. ఇండస్ట్రీలోని ముఖ్యమైన ఎవరికి ఆతిధ్యం ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తుంది. మరి కరోనా లాక్ డౌన్ సమయంలో బాలయ్య పుట్టినరోజునాడు ఎన్నడూ లేని విధముగా హంగామా అయితే మొదలైందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలను కెలికిన బాలకృష్ణ ఇప్పుడు పుట్టిన రోజు హంగామా కూడా అందరి చూపు తన వైపు తిప్పుకోవడమే అంటూ యాంటీ ఫాన్స్ బాలయ్య అభిమానులు, బాలయ్య మీద ఏసుకుంటున్నారు.

Tags:    

Similar News