నేను మోనార్క్ ని అంటున్న బాలయ్య!!

అప్పుడెప్పుడో సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చెయ్యలేరు అంటూ చెప్పే డైలాగ్ ఆ సినిమాలో బాగా [more]

Update: 2020-06-25 02:57 GMT

అప్పుడెప్పుడో సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చెయ్యలేరు అంటూ చెప్పే డైలాగ్ ఆ సినిమాలో బాగా పేలినట్లుగా.. ఇప్పుడు బాలకృష్ణ కూడా నేను మోనార్క్ అనబోతున్నాడట. బోయపాటి – బాలయ్య కాంబోలో ముచ్చటగా మూడో సినిమాగా రాబోతున్న పవర్ ఫుల్ కథకి మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. బాలయ్య – నిబోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాల వాలే బాగా పవర్ ఫుల్ గా ఈ మూడో సినిమా ఉండబవుతుంది అని మొన్నామధ్యన వదిలిన టీజర్ తో అర్ధమైంది.

అయితే ఈ సినిమా టైటిల్ విషయలో ఇప్పటివరకు ఎక్కడా న్యూస్ లేదు కానీ.. గత రెండు రోజులుగా బాలయ్య – బోయపాటి సినిమా టైటిల్ గా మోనార్క్ ప్రచారంలోకి రావడం.. బాలయ్య కి పర్ఫెక్ట్ టైటిల్ అంటున్నారు నందమూరి అభిమానులు. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి.. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా అనే డైలాగ్ కి ఈ టైటిల్ అయితే సూపర్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు.  సింహ, లెజెండ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య-బోయపాటి ర్ మూడో సినిమా మోనార్క్ తో హ్యాట్రిక్‌పై కన్నేశారు. 

Tags:    

Similar News