టైటిల్ బయటికొచ్చినా.. చిత్ర బృందం మాట్లాడదే

బాలకృష్ణ – కె.ఎస్‌ రవికుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరగడమే కాదు.. అప్పుడే శాటిలైట్ బిజినెస్ కూడా జరిగింది. బాలకృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ [more]

Update: 2019-10-24 06:36 GMT

బాలకృష్ణ – కె.ఎస్‌ రవికుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరగడమే కాదు.. అప్పుడే శాటిలైట్ బిజినెస్ కూడా జరిగింది. బాలకృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ ని వదిలేసి డిసెంబర్ లోనే కొత్త సినిమాతో రాబోతున్నాడని, సినిమా గురించి అబ్బో అంటూ వార్తలు రావడమే కానీ సినిమా టైటిల్ మాత్రం అఫీషియల్ గా బయటికి రాలేదు. కానీ శాటిలైట్ హక్కులు కొన్న ప్రముఖ ఛానల్ జెమిని వారు మాత్రం బాలయ్య కొత్త సినిమా టైటిల్ రూలర్ అంటూ ప్రకటించింది. అసలు టైటిల్ ని జెమిని వారు ప్రకటించి చాల రోజులవుతున్నప్పటికీ.. చిత్ర బృందం నుండి కన్ ఫర్మేషన్ లేదు.

యాక్షన్, కామెడీ కలయిక…

కనీసం ఆ టైటిల్ తో ఓ అఫీషియల్ పోస్టర్ కూడా బయటికి రాలేదు. ఇక ఈ దీపావళికి ఏమైనా బాలకృష్ణ కొత్త సినిమా పోస్టర్ తో పాటుగా టైటిల్ బయటికొస్తుందేమో చూడాలి.ఇంతకుముందు బాలయ్య న్యూ లుక్ బయటికి లీకయ్యాక హడావిడిగా చిత్ర బృందం బాలయ్య కొత్త సినిమా లుక్ ని విడుదల చేసింది. కానీ ఇప్పుడు టైటిల్ విషయంలో అలా లేదు. ఇకపోతే బాలకృష్ణ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో కనబడడమే కాకుండా సిట్య్చూయేషనల్ కామెడీ తో అలరిస్తాడని టాక్. సినిమాలో కావాల్సినంత యాక్షన్ అలాగే కామెడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు.

 

Tags:    

Similar News