బాలయ్య సినిమా ఆగిపోయిందని ఎవరు చెప్పారు?

ఎవరు ఊహించని విధంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి అంగీకరించాడు బాలయ్య. వీరి కాంబినేషన్ లో రెండు సినిమా వస్తుంది. కొంతవరకు షూటింగ్ కూడా కంప్లీట్ [more]

Update: 2019-06-08 07:43 GMT

ఎవరు ఊహించని విధంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి అంగీకరించాడు బాలయ్య. వీరి కాంబినేషన్ లో రెండు సినిమా వస్తుంది. కొంతవరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయింది కానీ సడన్ గా మూవీ ఆగిపోయింది. కారణం ఆంధ్ర లో వచ్చిన ఎన్నికల ఫలితాలు. ఈమూవీ లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయట.

తెలుగుదేశం పార్టీ అధికారంలో కి వస్తుందని భావించి చాలా కాన్ఫిడెంట్ గా స్క్రిప్ట్ రెడీ చేసుకుని షూటింగ్ కి వెళ్లారు. అయితే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి, ఆ సన్నివేశాలు, డైలాగ్స్ మార్చాలని బాలయ్య సూచించాడు. అలా సినిమా ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఈమూవీ మరోసారి వార్తల్లోకెక్కింది.

ఈ మూవీకి సంబంధించి అన్ని మార్పులు చేర్పులు పూర్తయ్యాయి. బాలయ్యకు మరోసారి ఫైనల్ నెరేషన్ వినిపించాడు దర్శకుడు కేఎస్ రవికుమార్. బాలయ్య కూడా ఓకే అనడంతో ఈనెల 12నుంచి ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈసినిమాలో హీరోయిన్, విలన్, ఇతర నటీనటులు ఎవరనే విషయం ఇంకా స్పష్టంకాలేదు. ప్రస్తుతం వారిని ఫైనల్ చేసే పైనిలో ఉన్నాడు డైరెక్టర్ రవి కుమార్.

Tags:    

Similar News