మరోసారి వైరల్ అవుతున్న బాలయ్య స్పీచ్..!

ఈ మధ్య బాలకృష్ణ ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఎంత జాగ్రతగా మాట్లాడదాం అని ట్రై చేసినా బాలయ్యకు కుదరట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే నిన్న [more]

Update: 2019-02-26 07:58 GMT

ఈ మధ్య బాలకృష్ణ ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఎంత జాగ్రతగా మాట్లాడదాం అని ట్రై చేసినా బాలయ్యకు కుదరట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే నిన్న బాలయ్య 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా వచ్చే నెల మార్చి 1న రిలీజ్ అవ్వబోతుంది. బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఇక బాలయ్య తన స్పీచ్ లో ఈ సినిమా పేరుని త‌ప్పుగా ఉచ్ఛ‌రించారు. 118 సినిమాను 189 అంటూ మార్చేశారు.

చెబితే వినిపించుకోకుండా…

ఒకసారి అయితే పర్లేదు స్పీచ్ మొత్తం అదే తప్పు టైటిల్ చెప్పారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చెప్పే ప్రయత్నం చేసారు కానీ బాలయ్య వినిపించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష నటించిన మహానాయకుడు కూడా డిజాస్టర్ కావడంతో కొంచం డాల్ గా కనిపించారు బాలయ్య. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. ఎందుకంటే తాను ఈ మూవీ ఆల్రెడీ చూశానని… అన్నయ్య కెరీర్ లోనే అత్యుత్త‌మ చిత్రంగా మిగిలిపోతుంద‌ని… నివేధ యాక్టింగ్ చూసి తనకు కన్నీరు వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News