బాలయ్య కూడా నాగ్ లా ఆలోచిస్తున్నాడా..!

Update: 2018-07-04 09:42 GMT

నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ ని ఒక సోలో హీరోగా కాకుండా తమ ఫ్యామిలీ మూవీ 'మనం' సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసాడు. 'మనం' సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం అంటే... నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ఫుల్ మూవీ లో నటించగా... చివరలో అదనపు ఆకర్షణ అన్నట్టుగా అఖిల్ కూడా 'మనం' సినిమాలో ఒక మెరుపు మెరిశాడు. ఇక ఆ సినిమాతో అఖిల్ వెండితెరకు సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సోలో హీరో గా చేసిన రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. ఇక బాలయ్య కూడా నాగార్జున లాగే ఆలోచిస్తున్నాడా అనిపిస్తుంది.

శర్వానంద్ అనుకున్నా...

ఎందుకంటే బాలకృష్ణ కూడా ఆయన కొడుకు మోక్షజ్ఞ ని 'ఎన్టీఆర్' బయో పిక్ ద్వారా వెండితెరకు పరిచయం చెయ్యాలనుకుంటున్నాడట. ఈ విషయంలో క్రిష్ కూడా అదే అభిప్రాయాన్ని బాలకృష్ణ ముందు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం 'ఎన్టీఆర్' బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో ఈ నెలలోనే మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే విద్య బాలన్ ఫోటో షూట్ అండ్ స్కిన్ టెస్ట్ కోసం హైదరాబాద్ కి వచ్చేసింది. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం విద్య బాలన్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రకి శర్వానంద్ ని తీసుకుంటున్నట్లుగా ప్రచారమైతే జోరుగా జరిగింది.

సన్నబడేందుకు సింగపూర్ కు..

కానీ తాజా సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చేస్తున్నాడంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర 'ఎన్టీఆర్' బయోపిక్ లో నిడివి తక్కువగా ఉంటుందని.. అందుకే ఆ పాత్రకి మోక్షజ్ఞని తీసుకుంటే ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా నందమూరి అభిమానులు కూడా ఫీల్ అవుతారనే భావనలో 'ఎన్టీఆర్' టీమ్ ఉందట. అందుకే మోక్షజ్ఞ ఫిట్ గా తయారవడం కోసం సింగపూర్ వెళ్లాడని టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మోక్షజ్ఞ బాగా బరువు పెరగడం... చుడడానికి బాగా బొద్దుగా ఉండంతో.. బాగా వర్కౌట్స్ చేసి సన్నబడి 'ఎన్టీఆర్' బయోలో నటిస్తాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది బాలయ్య ఓపెన్ అయితేనే తెలుస్తుంది. ఇక 'ఎన్టీఆర్' బయోపిక్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే అతని భవిష్యత్తు బాగుంటుందని బాలయ్య ఆలోచనగా చెబుతున్నారు.

Similar News