కన్నడ మూవీలో బాలయ్య..!

ఎన్టీఆర్ మహానాయకుడు తరువాత బాలయ్య ఇంతవరకు నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకొని వెళ్లలేదు. బాలయ్య తన నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ [more]

Update: 2019-04-26 06:11 GMT

ఎన్టీఆర్ మహానాయకుడు తరువాత బాలయ్య ఇంతవరకు నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకొని వెళ్లలేదు. బాలయ్య తన నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసారు. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంకా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూనే ఉన్నాడట. స్క్రిప్ట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఆయన ఉండటం వలన ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది.

కన్నడలో ఓ ఫవర్ఫుల్ రోల్ లో

అందుకే బాలయ్య తన ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా ఈ లోగా ఒక కన్నడ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కాకపోతే ఫుల్ లెంగ్త్ పాత్రలో కాదు. గెస్ట్ రోల్ లో బాలయ్య నటించనున్నాడు. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా ‘భైరతి రణగళ్’ రూపొందుతోంది. ఈ మూవీలో బాలయ్య ఒక పవర్ఫుల్ రోల్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర చేయాలని నటుడు శివరాజ్ కుమార్.. బాలయ్యని ఒప్పించారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా బాలకృష్ణ ఈ రోల్ చేయడానికి అంగీకరించారు.

Tags:    

Similar News