బాలయ్య పక్కన హాట్ హీరోయిన్

బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం బ్యాంకాక్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో [more]

Update: 2019-07-29 09:12 GMT

బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం బ్యాంకాక్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ఫైనల్ అయింది. అలానే మరో హీరోయిన్ గా సుమంత్ హీరోగా నటించిన ‘దగ్గరగా దూరంగా’ ఫేమ్ వేదిక కూడా ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.

నెగిటివ్ షేడ్ లో….

ఇక తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ తో నటించిన దానికి ఒక హాట్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు నమిత. గతంలో ఈమె బాలయ్య తో సింహ సినిమాలో నటించింది. అయితే రవికుమార్ సినిమాలో నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుందట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది. ఇక ఈసినిమాపై బాలయ్య అంచనాలు పెంచుకున్నాడు. ఇది ఎట్టిపరిస్థితుల్లో హిట్ అవ్వాలని చూస్తున్నాడు. రీసెంట్ గా ఈమూవీ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News