బాలయ్యకి ఆ ప్రాప్తం లేనట్లుందే!

Update: 2018-05-18 09:38 GMT

అసలు బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ విషయమై ఎక్కడా నోరు మెదపడం లేదు. తేజ డైరెక్షన్ బాధ్యతల నుండి తప్పుకున్నాక ఆ ప్లేస్ లోకి కె రాఘవేంద్రరావు లేదా క్రిష్ వస్తారని ప్రచారం జరిగింది. అయితే రాఘవేంద్ర రావు, క్రిష్ లు ఈ బాధ్యతలు నెత్తిన పెట్టుకొవడానికి సుముఖంగా లేకపోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను బాలకృష్ణే స్వయంగా మోస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ హీరో, నిర్మాత, దర్శకుడు బాలకృష్ణ అంటూ అనేకరకాల వార్తలు హోరెత్తాయి. అయితే తాజాగా తేజకి బాలయ్యకి ప్యాచప్ అంటూ కొన్ని వార్తలు రావడంతో బాలయ్యతో వి వి వినాయక్ డైరెక్షన్ లో సినిమాని నిర్మించబోయే సి కళ్యాణ్, తేజ మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ చేసే ఛాన్స్ లేదని తేల్చేసాడు.

క్రిష్ అయితేనే సరి....

అయితే బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్షన్ చెయ్యకపోవచ్చని దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇప్పుడు. గతంలో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ చరిత్రాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి చేసి విజయాన్ని అందుకున్నాడు. ఇక బాలయ్య - క్రిష్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో కంగనా హీరోయిన్ గా మణికర్ణికా అనే చరిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని క్రిష్ ఆగష్టు 15న విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఝాన్సీ లక్ష్మి జీవిత చరిత్రను మాణికర్ణికగా తెరకెక్కిస్తున్న క్రిష్ అది పూర్తయితేనే ఎన్టీఆర్ బయోపిక్ ని బాగా డైరెక్ట్ చెయ్యగలడనే అభిప్రాయాలను బాలయ్య దగ్గరికి సన్నిహితుల ద్వారా వస్తున్నాయట.

మణికర్ణిక తర్వాతే...

ఇక బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కి ఒక వైపున దర్శక నిర్మాత గాను మరో వైపున నటన పైన దృష్టి పెట్టడం కష్టమవుతుందని సన్నిహితులు చెప్పడంతో వెనక్కి తగ్గాడట. మరి ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేసే ప్రాప్తం లేకపోయినా అందులో నటించే భాగ్యం దక్కడం అదృష్టమే. మరి ప్రస్తుతం క్రిష్ ఖాళీగా లేకపోవడంతో ఈ సమయంలో బాలయ్య వి వి వినాయక్ దర్శకత్వంలో ఒక రీమేక్ సినిమా చెయ్యబోతున్నాడు. ఇక క్రిష్ తన మణికర్ణికను విడుదల చేసాక బాలయ్య క్రిష్ తో కలిపి ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదకెళ్తాడన్నమాట.

Similar News