బాలయ్య అందుకు ఒప్పుకుంటాడా?

Update: 2018-07-02 06:33 GMT

మహానటి సినిమా వచ్చాక ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్యకు కొన్ని ఐడియాలు ఉండగా అవి ఇప్పుడు మార్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ బయోపిక్ లో బాలయ్య ఒక్కడి గురించే కాకుండా ఇతర నటీనటులు గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానటి సినిమాలోని కొంత మంది నటీనటులను ఎన్టీఆర్ బయోపిక్ లో తీసుకోవాలని బాలయ్య.. నిర్మాతలు డిసైడ్ అయ్యినట్టు టాక్.

వారి పక్కన బాలయ్య నటిస్తే..?

ప్రస్తుతం ఈ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య.. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్టు భావిస్తున్నారు అంతా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎన్టీఆర్ పాత్ర బాలయ్య చేస్తున్నాడు. అంటే కీర్తి సురేష్ కానీ, చైతూ కానీ బాలయ్య పక్కన నటిస్తే అంతగా బాగోదు. ఎందుకంటే బాలయ్యకు ఏజ్, వెయిట్ ఎక్కువ కాబట్టి. మరి యంగ్ ఏజ్ లో ఎన్టీఆర్ పాత్ర ఎవరు పోషిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బాలయ్య కాకుండా ఇంకెవరైనా చేస్తే దానికి బాలకృష్ణ అంగీకరిస్తాడా? ఒకవేళ అంగీకరించినా ఎంత భాగం మరో నటుడికి అవకాశమిస్తారు? ఇలా ప్రస్తుతం మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

Similar News