పొద్దున్నే టెన్షన్…. సాయంత్రానికి కూల్

నిన్న ఉదయం సోషల్ మీడియాలో బాలకృష్ణ కొత్తగా సరికొత్తగా ఉన్న ఓ న్యూ గెటప్ లుక్ బయటికి వచ్చింది. మరి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, టిడిపి ఓటమి [more]

Update: 2019-08-21 05:41 GMT

నిన్న ఉదయం సోషల్ మీడియాలో బాలకృష్ణ కొత్తగా సరికొత్తగా ఉన్న ఓ న్యూ గెటప్ లుక్ బయటికి వచ్చింది. మరి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, టిడిపి ఓటమి తర్వాత బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా మీద చాలామందికి చాలా ఆసక్తి ఉంది. మామూలుగానే బాలకృష్ణ కొత్త మూవీ కి సంబందించిన అప్ డేట్ ఏది బయటికొచ్చిన… క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా బాలకృష్ణ, కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 105 వ సినిమాని షూటింగ్ ని చకచకా మొదలెట్టేసాడు. తాజాగా ఆ సినిమాలోని బాలయ్య గెటప్ ఒకటి బయటికొచ్చింది. అయితే ఆ లుక్ లో బాలయ్య ఫ్రెంచ్ గెడ్డంతో కాస్త వెరైటీగా కనిపించాడు. ఆ లుక్ చూసిన బాలయ్య అభిమానులకు బాబోయ్ మా హీరో గారి లుక్ ఏమిటి ఇలా ఉంది అంటూ టెన్షన్ పడ్డారు. ఎందుకంటే గతంలో బాలయ్య చాలా సినిమాల్లో అస్సలు సూట్ కానీ విగ్, గెడ్డం లుక్స్ తో చిరాకు తెప్పించాడు. తాజాగా బయటికొచ్చిన లుక్ లోను బాలయ్య కాస్త డిఫ్రెంట్ గా కనిపించేసరికి బాలయ్య అభిమానులు కంగారు పడ్డారు.

అయితే ఎవరో బాలయ్యతో షూటింగ్ స్పాట్ లో సెల్ఫీ దిగి మరీ లీక్ చేసిన పిక్ అది. ఒరిజినల్ లుక్ అది కాదు. ఇలా ఆ లుక్ క్షణాల్లో వైరల్ అవడంతో.. బాలయ్య – రవి కుమార్ లు కి షాక్ తగిలి.. హడావిడిగా పిఆర్ టీమ్ తో బాలకృష్ణ న్యూ లుక్ ని సాయంత్రానికల్లా విడుదల చేయించారు. బాలయ్య స్టాండ్ లుక్ లో అలా అలా నడిచొస్తుంటే కొత్తగా సరికొత్తగా కనిపించేసరికి బాలయ్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీకెడ్ పిక్ లో బాలయ్య గెటప్ కి ఫీల్ అయిన ఫ్యాన్స్.. ఒరిజినల్ స్టాండింగ్ లుక్ చూసి కూల్ అయ్యారు. మరి లీకైన పిక్ కన్నా ఒరిజినల్ పిక్ చాలా బావుంది అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News