బాలయ్యని వదలనంటున్న బాబు

మెగా హీరో నాగబాబు ఈమధ్యన బాలకృష్ణ ని సోషల్ మీడియాలో వరసగా ఆడేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నందుకు బాలకృష్ణ ని నాగబాబు మాములుగా ఆడుకోవడం లేదు. [more]

Update: 2019-01-04 10:47 GMT

మెగా హీరో నాగబాబు ఈమధ్యన బాలకృష్ణ ని సోషల్ మీడియాలో వరసగా ఆడేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నందుకు బాలకృష్ణ ని నాగబాబు మాములుగా ఆడుకోవడం లేదు. మొన్నటికిమొన్న బాలకృష్ణ ఎవరో తెలియదని కామెంట్ చేసిన నాగబాబు నిన్నటికి నిన్న బాలకృష్ణ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ని బేస్ చేసుకుని… ఒక దున్నపోతుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్లడ్, బ్రీడు అంటూ హాట్ హాట్ కామెంట్ చేసాడు. ఇక తాజాగా బాలకృష్ణ నటించిన బయోపిక్ పై వంకరగా కామెంట్ చేసాడు నాగబాబు.

ఎన్టీఆర్ బయోపిక్ లో తండ్రి పాత్రని చేసిన బాలకృష్ణ ని పరోక్షంగా నాగబాబు మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు. అది కూడా కవిత్వం రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. నాగబాబు బయోపిక్ లని ఉద్దేశించి… కట్టు కథలు కొన్ని .. కల్పనలు ఇంకొన్ని .. చుట్టనేల .. మూట కట్టనేల .. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా .. విశ్వదాభిరామ .. వినరా మామా అంటూ వెటకారంగా పోస్ట్ చెయ్యడమే కాదు… కవిత్వాలు మాకు వచ్చండోయ్ అంటూ హాట్ హాట్ డైలాగ్ కూడా పేల్చాడు. మరి బాలయ్య ని వదలకుండా నాగబాబు చేసే ఈ వ్యాఖ్యలవలన నందమూరి అభిమానులు నాగబాబు పై విరుచుకుపడుతున్నారు.

అభిమానులతో నాకు లెక్కేంటి అంటూ నాగబాబు మాత్రం బాలకృష్ణ ని వదలడం లేదు. ఇక ఆ కవిత్వంతో పాటుగా స్టే ట్యూన్డ్ అంటూ క్యాప్షన్ పెట్టడం చూస్తుంటే నాగబాబు ఇప్పట్లో బాలకృష్ణ ని వదిలేలా కనబడ్డం లేదు. చూద్దాం నాగబాబు ఎంత దూరం వెళ్లి ఆగుతాడో అనేది. మరి ఈ నాగబాబు కవిత్వానికి నందమూరి అభిమానుల స్పందన ఏమిటో చూడాలి.

Tags:    

Similar News