‘నం.1 యారీ’ షో కి బాలకృష్ణ.. ఫుల్ ఫన్..!

Update: 2018-12-24 07:21 GMT

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. భారీ అంచనాల మధ్య వచ్చే నెల జనవరి 9న మొదటి పార్ట్ రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియోతో పాటు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిష్ బాలయ్యను చూపించిన తీరు అందరికీ తెగ నచ్చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో బాలయ్య - క్రిష్ ఈ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో క్రిష్ - బాలయ్య ఇద్దరు కలిసి దగ్గుబాటి రానా నిర్వహించే ‘నం.1 యారీ’ ప్రోగ్రాంకు వెళ్లారు. నిన్న దానికి సంబంధించి ప్రోమో ఒకటి విడుదలై సామాజక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అంతకు ముందు బాలకృష్ణ - పూరి 'పైసా వసూల్' ప్రమోషన్స్ కోసం ‘నం.1 యారీ’ ప్రోగ్రాంకు వెళ్లారు. అప్పుడు ఆ ప్రోగ్రాంకు మంచి టీఆర్పీ వచ్చింది.

ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ

ఇప్పుడు కూడా దానికి మించి టీఆర్పీ వచ్చేలా కనిపిస్తుంది. ఈ ప్రోమోలో బాలయ్య మిస్టర్ హ్యాండ్సమ్ అనే ట్యాగ్ వేసుకుని ర్యాంప్ వాక్ చేయడం... ఇమోజీలకు తగ్గట్లుగా రకరకాల హావభావాలు చూపించడం... చిన్నపిల్లాడు ఏడుస్తున్నట్లు నోట్లో చెయ్యి పెట్టుకోవడం... రానాను నువ్వు ఆ సర్ అనడం ఆపవయ్యా అని సరదాగా అనడం... ఇలా చాలానే చేసాడు బాలయ్య. రెండో మూడు స్టెప్స్ కూడా వేసాడు. రానా.. క్రిష్ ను బాలకృష్ణ గారికి కోపం వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు క్రిష్ దాని గురించి చెప్పాలా అనడం.. బాలయ్య గారు సోషియోఫాంటసీ ఎంచుకుంటారా? రొమాంటిక్ డ్రామా ఎంచుకుంటారా? అని క్రిష్ ని అడగగా.. అతను రొమాంటిక్ డ్రామానే అనడంతో దానికి బాలయ్య క్రిష్ వైపు చూసి సరదాగా ఇచ్చిన సీరియస్ ఎక్స్‌ ప్రెషన్ మరో హైలైట్. అలా ఈ షో మొత్తం ఫుల్ ఫన్ తో సాగినట్టు అర్ధం అవుతుంది. వచ్చే ఆదివారం ఈ షో టెలికాస్ట్ కానుంది.

Similar News