అపజయాలకు నేను ఎప్పుడు కుంగిపోలేదు

కొన్ని గంటల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు లో కథానాయకుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయింది. [more]

Update: 2019-02-22 02:42 GMT

కొన్ని గంటల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు లో కథానాయకుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో మహానాయకుడు పై ఎటువంటి అంచనాలు లేకూండా పోయాయి. మొదటి భాగం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ 50 కోట్లు వరకు నష్ట పోయారు. సో ఆ ఎఫెక్ట్ రెండో భాగం పై పడింది.

మొదటి భాగం హిట్ అయ్యి ఉంటె మహానాయకుడు పరిస్థితి వేరేలా ఉండేది. ప్రమోషన్స్ తో ఒక ఊపు ఊపేసేవారు మేకర్స్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ లో బాలకృష్ణ….ట్రైలర్ లో ఉన్న డైలాగ్ ‘మొదటి సినిమా ఆడలేదంట.. ఆ తర్వాతి సినిమాకు తిరుగులేదంట’ ను ప్రస్తావిస్తూ “ఎన్టీఆర్ ఇలాంటి సెంటిమెంట్లను ఎంతవరకూ ఫాలో అయ్యేవారు?” అని ప్రశ్నిస్తే…బాలయ్య దానికి ” నాన్నగారు అటువంటి వి ఏమి పటించుకునేవారు కాదు. ఏదైనా పని చేస్తే నిర్దిష్టమైన సంకల్పంతో చేసేవారు. అపజయాలకు కుంగిపోవడం… విజయాలకి పొంగిపోవడం ఆయన చరిత్రలోనే లేదు అన్నారు. అలానే నాకు కూడా అలవాటైంది”. అన్నారు బాలయ్య.

దీనిబట్టి బాలయ్య కథానాయకుడు వల్ల కొంచం కూడా బాధ పడలేదని అర్ధం అయింది. అలానే మొదటి భాగం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికి తగురీతిలో న్యాయం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.మరి సినిమా రిజల్ట్ కొన్ని గంటల్లో తేలిపోనుంది

Tags:    

Similar News