ముహూర్తం ఇప్పుడు… షూటింగ్ ఎప్పుడు..?

బాలకృష్ణ – బోయపాటి కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటిలో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏడాది నందమూరి ఫాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. [more]

Update: 2019-03-07 10:16 GMT

బాలకృష్ణ – బోయపాటి కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటిలో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏడాది నందమూరి ఫాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. కథానాయకుడు, మహానాయకుడు ఘోరమైన డిజాస్టర్స్ అవడంతో నందమూరి ఫ్యాన్స్ బోయపాటితో మొదలు కాబోయే చిత్రం కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన సింహ, లెజెండ్ సినిమాలు ఏ రేంజ్ హిట్స్ తెలిసిందే. అయితే బాలకృష్ణ మాత్రం ఎన్నికల తర్వాతే బోయపాటి సినిమా సెట్స్ మీదకు వెళ్లాలని అనుకుంటున్నాడు. మరోసారి హిందూపూరం ఎమ్యెల్యేగా పోటీ చెయ్యబోతున్న బాలయ్య మేలో వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాడు. మరి టీడీపీ తరుపున కూడా ప్రచారం చెయ్యాలి గనక ఇప్పుడప్పుడే బోయపాటి సినిమా చేసే ఉద్దేశ్యం బాలయ్యకి లేదు.

ఎన్నికల బిజీలో ఉండటంతో…

అలాగే ఇంతకుముందు ఎన్బీకే ఫిలిమ్స్ లోనే బోయపాటి సినిమా నిర్మిస్తానని చెప్పిన బాలయ్య ఇప్పుడు ఆలోచనలో పడినట్లుగా సోషల్ మీడియా టాక్. ఇకపోతే బోయపాటి కూడా టీడీపీ ఎన్నికల యాడ్స్ షూట్స్ తో బిజీగా ఉండడంతో బాలయ్య సినిమా ఎప్పుడు మొదలైనా ఓకే అన్నట్లుగా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి – బాలకృష్ణల సినిమా మార్చి 28న పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా మార్చిలో మొదలైనా షూటింగ్ మాత్రం ఎన్నికల తరువాతే స్టార్ట్ కానుంది. అంటే జూన్ నుండి బోయపాటి – బాలయ్యలు సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉందంటున్నారు.

Tags:    

Similar News